మనోళ్లు అమెరికాలో ఏ స్థాయిలో ఉన్నారు? వారికి అక్కడ లభిస్తున్న గౌరవ మర్యదలు ఎంతలా ఉన్నాయన్న విషయాన్ని తెలియజేసే ఉదంతంగా దీన్ని చెప్పాలి. అమెరికా అధికారం మొత్తం పోగుపడి ఉండే వైట్ హౌస్ లోనే మనోళ్ల ప్రాధాన్యం అంతకంతకూ పెరుగుతోంది. ఆ మాటకు వస్తే.. అగ్రరాజ్యంలోని వివిధ విభాగాల్లో మనోళ్లు తమ సత్తా చాటుతున్నారు. నాసాలో పని చేస్తున్న 8 శాతం మంది ఆసియన్లలో రెండు శాతం భారతీయులు ఉన్నట్లు చెబుతారు.
తాజాగా నాసా ప్రయోగించిన ప్రతిష్ఠాత్మక నాసా మిషన్ లో.. మనోళ్లు కీలక భూమిక పోషించటం తెలిసిందే. నుదుటన బొట్టు పెట్టుకొని.. ముఖానికి మాస్కు పెట్టుకున్న స్వాతీ మోహన్ లాంటి శాస్త్రవేత్తల ఫోటోలు చూసిన భారతీయులంతా పులకరించిపోయారు. మనమ్మాయి ప్రతిభకు ఫిదా అయ్యారు. జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీలో ఆమె తన తొలి మిషన్ ను సక్సెస్ ఫుల్ గా చేసిన వైనం అందరి చేత అభినందనల్ని పొందుతోంది.
మార్స్ మిషన్ విజయవంతం కావటంతో నాసా టీంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వర్చువల్ గా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ల్యాండింగ్ లో కీలకభూమిక పోషించిన స్వాతితో బైడెన్ ముచ్చటించారు. మన ఎప్పటికి వెళ్లలేని ప్రదేశానికి వెళ్లి చూసినట్లుగా ఉందని.. రోవర్ పంపిన ఫోటోల్ని చూసినప్పుడు తనకు అనిపించినట్లుగా బైడెన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశాధ్యక్షుడితో మాట్లాడే అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపే ప్రయత్నం చేశారు.
దానికి అనూహ్యంగా స్పందించారు బైడెన్. ఆమెను వారిస్తూ.. ‘‘నన్ను ఆట పట్టిస్తున్నావా? నీతో మాట్లాడే అవకాశం రావడమే నాకు గౌరవం’’ అని పేర్కొనటంతో స్వాతి మోహన్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అగ్రరాజ్యాధినేత నోటి నుంచి ఈ తరహా ప్రశంసకు మించింది ఏముంటుంది? మనమ్మాయిని ఉద్దేశించి బైడెన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.