అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి కోసం జరిగిన ఎన్నిక యావత్ ప్రపంచాన్ని ఎంత టెన్షన్ పెట్టేసిందో తర్వాత కూడా అంతే టెన్షన్ కంటిన్యు అవుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా అధ్యక్ష ఎన్నికల తర్వాత కూడా వివాదం కంటిన్యు అవుతుండటం ఆశ్చర్యంగా ఉంది. డెమక్రటిక్ అభ్యర్ధి జో బైడెన్ అమెరికా అధ్యక్షునిగా గెలిచినట్లే అని ప్రపంచంలోని యావత్ మీడియా ప్రకటించేసింది. అయితే అమెరికాలోనే మీడియా మాత్రం ఇంతవరకు అధ్యక్షునిగా బైడెన్ ఎన్నికను నిర్ధారించకపోవటమే విచిత్రంగా ఉంది.
అమెరికా మీడియా ఎందుకు నిర్ధారించలేదంటే పోలింగ్, దాని తర్వాత జరిగిన కౌంటింగ్ విషయాల్లో అక్రమాలు జరిగినట్లు రిపబ్లికన్ అభ్యర్ధి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు కోర్టుల్లో కేసులు వేయటమే. పైగా బైడెన్ ఎన్నిక చెల్లదంటూ రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. తనదైన వింత లాజిక్కులతో యావత్ ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ట్రంప్ న్యాయపోరాటం తేలాలంటే కనసీం మరో రెండు నెలలైనా పడుతుందని అమెరికాలోని న్యాయ నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం బైడెన్ అధ్యక్షునిగా ఎన్నికైనట్లేనట. కాకపోతే అధికారికంగా ప్రకటించటానికి కాస్త సమయం పడుతుందంటున్నారు. ట్రంప్ ఎంత పోరాటం చేసినా పాపులర్ ఓట్లు, ఎలక్టోరల్ ఓట్ల ఫలితాన్ని మార్చటం సాధ్యం కాదంటున్నారు.
అగ్రరాజ్యంలోని స్వింగ్ రాష్ట్రాలుగా ప్రచారం జరిగిన పెన్సిల్వేనియా, ఆరిజోనా, మిషిగాన్ లో గెలిచిన డెమక్రాట్ అభ్యర్ధులను ఆయా రాష్ట్రాల్లోని చట్టసభలు గుర్తించనీయకుండా ట్రంపు అడ్డుకుంటున్నారట. అయితే తన పోరాటంలో ఏమీ తేలకపోతే చివరకు పై రాష్ట్రాల్లోని చట్టసభలకు రిపబ్లికన్ అభ్యర్ధులను ఎంపిక చేయటం ద్వారా తనకు ఓట్లేసేట్లు ట్రంప్ చేయబోతున్నారట. అయితే ఇది సాధ్యమేనా అన్నది నిపుణుల అనుమానం.
ట్రంపు ఆరోపిస్తున్నట్లుగా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనేందుకు ఆధారాలు చూపటం లేదట. కేవలం ఆరోపణలతోనే కాలాన్ని సాగదీయాలని ట్రంపు ప్రయత్నిస్తున్నట్లు న్యాయ నిపుణులు అనుమానిస్తున్నారు. ఒకవేళ ఎలక్టోరల్ ఓట్లను తారుమారు చేయాలని ట్రంపు ప్రయత్నిస్తే ప్రజాగ్రహాన్ని చూడటం తప్ప మరేమీ ఉపయోగం ఉండదని కూడా అంటున్నారు. అయితే ఎవరేమన్నా ట్రంపు మాత్రం దేన్నీ లెక్క చేయటం లేదు. మొత్తానికి తన ఎన్నికల ప్రక్రియ ద్వారా అమెరికా ప్రపంచం ముందు నవ్వుల పాలవుతోంది.