ఉత్తరాంధ్రాలో చూస్తే అయిదింట నాలుగు ఎంపీ సీట్లను వైసీపీ 2019 ఎన్నికల్లో గెలుచుకుంది. ఒకే ఒక స్థానం శ్రీకాకుళం ఎంపీ సీటుని కింజరాపు రామ్మోహన్ నాయుడు గెలిచారు. విజయనగరం లోక్ సభ నుంచి బెల్లాల చంద్రశేఖర్ గెలిచారు. ఆయన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుని ఓడించి మరీ జెయింట్ కిల్లర్ అయ్యారు. అంతలా జనాల మద్దతు దక్కినా చంద్రశేఖర్ మూడేళ్ళుగా తన సత్తా ఏమీ చూపించడంలేదు అన్న విమర్శలు ఉన్నాయి. ఎంపీ గారు ఏం చేస్తున్నారు అన్న జనం ప్రశ్నలకు సమాధానం లేదని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో సేఫ్ గా ఉండే అసెంబ్లీ సీటు చూసుకుని గెలవలని చంద్రశేఖర్ ప్లాన్ చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఎచ్చెర్ల సీటు మీద కర్చీఫ్ వేశాడని అంటున్నారు. ఎంపీగా ఆ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు కలుస్తాయి. దాంతో ఎంపీ అలా డిసైడ్ అయ్యారు. సరే ఆయన సంగతి బాగానే ఉంది మరి విజయనగరం ఎంపీగా ఎవరు అంటే వైసీపీలో జవాబు లేదు. భారీ అన్వేషణ చేయాల్సిందే అంటున్నారు.
విశాఖ ఎంపీ సీటుకు వస్తే కేవలం మూడు వేల మెజారిటీతో ఎంవీవీ సత్యనారాయణ గెలిచారు. జనసేన మధ్యలో లేకపోతే ఆయన కచ్చితంగా ఓడిపోతారు అనేందుకు ఏ రాజకీయ విశ్లేషణ అవసరం లేదని అందరికీ తెలుసు. ఆయన కూడా ఎంపీగా మళ్లీ గెలిచేది లేదని అర్ధం చేసుకున్నట్లే ఉందని అంటున్నారు. ఇక ఎంపీగా ఆయన పెర్ఫార్మెన్స్ మీద జనాలకు అసంతృప్తి ఉంది.
దాంతో ఆయన ఎమ్మెల్యే సీటు మీదనే దృష్టి సారించారు అని అంటున్నారు. భీమిలీ, విశాఖ తూర్పుల నుంచి ఏదో ఒకటి తనకు కేటాయిస్తే చాలు గెలిచివస్తాను అని అంటున్నారుట. అయితే విశాఖ ఎంపీ సీటు మామూలుది కాదు, ఇక్కడ టీడీపీకి పట్టుంది. దాంతో వచ్చే ఎన్నికల్లో ఈ సీటుకు ఎవరు వైసీపీ క్యాండిడేట్ అంటే వెతకడమే అంటున్నారు.
అనకాపల్లి నుంచి చూస్తే ఇక్కడ డాక్టర్ భీశెట్టి సత్యవతి గెలిచారు. ఆమె కూడా జగన్ ఊపులోనే గెలిచారు. ఇక మూడేళ్ళుగా ఆమె కూడా చేసింది లేదు. చేయాల్సింది లేదు. జస్ట్ ఎంపీగారు అన్నట్లుగా ఉన్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ దక్కదు అంటున్నారు. జనాలకు కూడా ఎంపీ ఎవరో తెలియదు అన్నట్లే విమర్శలు ఉన్నాయి. మరి ఇక్కడ కూడా టీడీపీ స్ట్రాంగ్ గా ఉంది వైసీపీకి గట్టి క్యాండిడేట్ దొరకడం అంటే కష్టమే.
చివరిగా చెప్పాలీ అంటే అరకు సీటు. ఇక్కడ పాతికేళ్ళకే ఎంపీ అయిన గొడ్డేటి మాధవి ఉన్నారు. ఆమె తనకు వచ్చిన అవకాశాన్ని ఏ మాత్రం సద్వినియోగం చేసుకోలేదు అని అంటున్నారు మెజారిటీ రెండున్నర లక్షలకు పైగా వచ్చింది. కేంద్ర మాజీ మంత్రి కొశోర్ చంద్రదేవ్ ని ఓడించి ఆమె రికార్డ్ సృష్టించారు. అయితే ఆమె జనాలకు పెద్దగా కనిపించడంలేదు అనే అంటున్నారు. ఇక్కడ కూడా కొత్త వారికే సీటు ఇవ్వాలీ అంటే పోటీ ఉంది కానీ ఎవరు గెలుస్తారు అన్నదే ప్రశ్న. ఇక 2014 ఎన్నికల్లో అరకు మాత్రమే వైసీపీ పరం అయింది. 2024 ఎన్నికల్లో ఈ అయిదింట ఎన్ని ఎంపీ సీట్లు దక్కుతాయి అంటే జవాబు చెప్పడం కష్టమే అంటున్నారు. బిగ్ ట్రబుల్ లో వైసీపీ ఉంది అంటున్నారు.