అమరావతి మీద బిగ్ ట్విస్ట్... తీర్పు మీద రివ్యూ...?

Update: 2022-08-24 02:30 GMT
అమరావతి రాజధాని మీద హై కోర్టు తీర్పు ఇచ్చేసింది. ఇది జరిగి కూడా దాదాపుగా ఏడాది కావస్తోంది. ఈ నేపధ్యంలో రైతులకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. అదే టైమ్ లో ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని తీర్పులో విస్పష్టంగా చెప్పారు.  అలాగే   అమరావతి రాజధానిని ప్రతిపాదించిన మేరకు నిర్ణీత  గడువులోగా పూర్తి చేయాలని కూడా తీర్పులో పేర్కొన్నారు.

దీని మీద వైసీపీ సర్కార్ అయితే న్యాయపరంగా ఏ రకమైన చర్యలను చేపట్టలేదు. హై కోర్టు తీర్పు మీద సుప్రీం కోర్టులో అప్పీల్ చేయాల్సి ఉన్నా కూడా ఆ పని చేయలేదు. అదే సమయంలో చట్టాలు చేసే హక్కు అసెంబ్లీకి ఉందంటూ వైసీపీ నేతలు వాదించారు. అలాగే దీని మీద అసెంబ్లీలో చర్చ కూడా పెట్టారు.

అయితే ఈ మధ్యకాలంలో మరో మారు మూడు రాజధానులు అంటూ వైసీపీ మంత్రులు చెబుతూ వస్తున్నారు. అలాగే వైసీపీ నేతలు కూడా దీని మీద మాట్లాడుతున్నారు. అయితే అదెలా సాధ్యం అన్న ప్రశ్న ఒక వైపు ఉత్పన్నం అవుతోంది. హై కోర్టు తీర్పు మీద న్యాయపరంగా తమ వైపు వాదనలు వినీపంచేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా మూడు రాజధానులు సాధ్యమేనా అన్న చర్చ కూడా వచ్చింది.

అయితే ఇపుడిపుడే ప్రభుత్వం ఆలోచనలు బయటకు వస్తున్నాయి. తాజాగా అమరావతి రాజధాని పనుల మీద హై కోర్టులో విచారణ జరిగిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. తమ ప్రభుత్వం అమరావతి రాజధాని తీర్పు మీద రివ్యూ పిటిషన్ ని హై కోర్టులో వేయబోతున్నట్లుగా ప్రకటించారు.

అమరావతి రాజధానిలో పనులు విషయంలో ప్రభుత్వం ఉదాశీనంగా ఉన్న విషయం కూడా ప్రస్థావనకు వచ్చింది. దీని మీద ప్రభుత్వం ఏం చేయబోతోంది అని కోర్టు ప్రశ్నించినపుడు దాని మీద అడ్వకేట్ జనరల్ తాము ఏకంగా అమరావతి తీర్పు మీదనే రివ్యూ పిటిషన్ వేస్తామని చెప్పడం విశేషం. అంటే అమరావతి ఏకైక రాజధానిగా ఇచ్చిన తీర్పుని మరోసారి సమీక్షించాలంటూ ప్రభుత్వం పిటిషన్ వేయబోతోంది అన్న మాట.

మరి దీని మీద హై కోర్టు లో విచారణ జరిగితే ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి. ఏది ఏమైనా రివ్యూ పిటిషన్ వేయడానికి ప్రభుత్వం నిర్ణయైంచుకుంది అంటే కచ్చితంగా మూడు రాజధానుల విషయంలో సర్కార్ కట్టుబడి ఉన్నట్లే అనుకోవాలి. ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నట్లుగా కూడా లెక్క. అదే టైమ్ లో ఈ నెల 29న జరితే మంత్రి వర్గ సమావేశంలో మూడు రాజధానుల మీద అనుసరించాల్సిన వైఖరిని కూడా ప్రభుత్వం చర్చిస్తుంది అని అంటున్నారు. మొత్తానికి అమరావతి రాజధాని విషయంలో ఇది బిగ్ ట్విస్ట్ గానే చూడాలని అంటునన్రు.
Tags:    

Similar News