లంచం తీసుకుంటూ ఎన్నికల ముందు మంత్రి బుక్

Update: 2015-10-12 05:20 GMT
చేతిలో డబ్బులు వచ్చి పడుతుంటే నేతలు వెనుకా ముందు చూసుకోరేమో. రోజూ అలవాటైన పని గురించి పెద్దగా ఆలోచించరేమో. మరికొద్ది గంటల్లో ఎన్నికలు షురూ కానున్న వేళ.. తాను లంచం తీసుకుంటూ దొరికిపోతే ప్రభుత్వానికి ఇబ్బందన్న కనీసం కూడా ఆలోచించని బీహార్ మంత్రి వైనం ఇది. తాను బుక్ కావటమే కాదు.. పార్టీని బుక్ చేసిన ఆయన పదవి ఊడిపోయినా.. ఆయన మిగిల్చిన మచ్చ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న భయంతో వణుకుతున్నారు బీహార్ అధికారపక్షం.

ఎన్నికలు ప్రారంభం కావటానికి ఒక రోజు ముందు బీహార్ మంత్రి అవినీతి వ్యవహారం స్టింగ్ ఆపరేషన్ తో బయటకు వచ్చింది. ఎక్సైజ్ మంత్రి అవధేవ్ కుశ్వాహా కు రూ.4లక్షలు విలేకరులు ఇవ్వటం.. ఆయన కెమేరా కంటికి దొరికిపోయారు. ఈ ఘటన బయటకు రావటంతో అధికార జేడీయూ కంగుతిన్నది. వెంటనే రియాక్ట్ అయిన ముఖ్యమంత్రి నితీశ్.. సదరు మంత్రిని పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వేళ జరిగిన ఈ వ్యవహారం ఎన్నికల్లో ఎంత ప్రభావం చూసిస్తుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News