పక్కింటి పుల్లకూర ఎప్పటికి రుచి అన్నట్టు భార్య ఉన్నా పక్కింటి వారిపై కన్నేయడం పురుషులకు అలవాటే. అది సాధారణ మనిషైనా అమెరికా అధ్యక్షుడైనా వాటికి అలవాటు పడతాడు. అలాంటి వ్యవహారమే అమెరికా అధ్యక్షుడు వ్యవహరించాడు. అయితే అప్పట్లో ఇది బయటకు వచ్చినా అంగీకరించలేదు.. తాజాగా ఈ విషయం ఒప్పుకున్నాడు. కొద్దిసేపు ప్రశాంతత కోసమని, స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావాలని భావిస్తూ భార్యను కాదని మరో వ్యక్తితో గడిపానని తాజాగా అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అంగీకరించారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దీనిపై ఆరోపణలు రాగా కొట్టిపారేశారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఆ విషయంపై ఆయన నోరు విప్పి అది వాస్తవమేనని అంగీకరించాడు.
మోనికా లెవిన్‌స్కీతో వివాహేతర సంబంధం కొనసాగించినట్లు బిల్ క్లింటన్ పై ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అధ్యక్షుడి గా ఉన్నసమయంలో ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వివాహేతర సంబంధం వార్త అమెరికా రాజకీయాల్లో సంచలనం రేపింది. ఇదే ఆరోపణపై 1998, డిసెంబర్ 19న అభిశంసనను క్లింటన్ ఎదుర్కొన్నాడు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు వివాహేతర సంబంధం కొనసాగించలేదని స్పష్టం చేస్తూనే వచ్చారు.
అయితే దీనిపై ఇటీవల ఆయన అంగీకరించారు. ‘వానిటీ ఫెయిర్’ పత్రిక కోసం బిల్ క్లింటన్ రాసిన వ్యాసంలో ఆ విషయాలను వెల్లడించారు. మోనికా లెవిన్ స్కీతో వివాహేతర సంబంధం నిజమేనని బిల్ క్లింటన్ ప్రకటించారు. ఒత్తిడి, నిరాశ, ఆందోళనల నుంచి ఉపశమనం పొందేందుకే ఇలాంటి పనిచేశానని తెలిపారు. ఆమెతో గడపడంతో ఒత్తిడి తగ్గి ప్రశాంతం గా ఉండేవాడినని వివరించారు. అయితే కొన్ని విషయాలు మనల్ని జీవితాంతం వెంటాడతాయని.. ఇది కూడా అలాంటి తప్పేనని ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ అంగీకరించారు. మోనికాతో సంబంధం తన జీవితంలోనూ ఇద్దరి అంగీకారం, పరస్పర అవగాహనతోనే బిల్ క్లింటన్‌తో అఫైర్ సాగిందని మోనికా లెవిన్‌స్కీ గతం లో వెల్లడించారు.
తమ అఫైర్‌లో క్లింటన్ చొరవ తీసుకున్నారని ‘వానిటీ ఫెయిర్’ పత్రిక కోసం రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. తమ ఇద్దరి మధ్య జరిగిన వ్యవహారంపై తాను తీవ్ర పశ్చాత్తాపానికి గురయ్యానని తెలిపపారు. ఇక వ్యవహారానికి ముగింపు చెప్పాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారం అనేక మలుపులకు దారితీసిందని గుర్తుచేసుకున్నారు. రాజకీయంగా, కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని వెల్లడించారు.