మోదీ మామూలోడు కాదు: బిల్‌ గేట్స్‌

Update: 2019-01-17 16:20 GMT
భారత దేశ ప్రధాని మోదీని పొగుడుతూ..చాలామంది దేశాల అధ్యక్షులు ప్రకటినలు చేస్తూనే ఉంటారు. పొగడడం అనేది వారికి అవసరం. కానీ ప్రపంచ కుబరుడైన బిల్‌ గేట్స్‌ కి ఏమాత్రం అవసరం లేదు. ఎందుకంటే.. ఆయన చిటికేస్తే చాలామంది దేశాధినేతలు వచ్చి ఆయన ముందు క్యూ కడతారు. కానీ బిల్‌గేట్స్‌ మాత్రం ఎప్పుడూ రియాలిటీకే ప్రాధాన్యతనిస్తారు. అందుకే.. మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్ని మొదటినుంచి చూస్తున్న ఆయన.. మోదీని ఆకాశానికి ఎత్తేశారు. గురువారంనీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ట్రాన్స్‌ ఫార్మింగ్‌ ఇండియా కార్యక్రమంలో ప్రసంగించారు. ఈసందర్భంగా ఆరోగ్యం - విద్య - పారిశుద్ధ్య రంగాల్లో టెక్నాలజీ వినియోగంపై గేట్స్ మాట్లాడారు.

రూ.500 - రూ.1000 నోట్లను రద్దు చేసిన నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. దీనివల్ల నల్లధనం నుంచి దేశాన్ని రక్షించడం సులువు అవుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు. అలాగే.. టెక్నాలజీ విషయంలో భారత్‌ అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని.. ఇప్పటివరకు ఏ దేశం ఈ విధంగా చేయలేదని అన్నారు. అన్నిటికి మించిస్వచ్ఛతా హీ సేవ అంటూ మహాత్ముడిస్ఫూర్తితో మోదీ ప్రవేశపెట్టిన ‘స్వచ్ఛభారత్‌’ కార్యక్రమం ద్వారా దేశంలోపారిశుద్ధ్యం మెరుగుపడిందని బిల్‌ గేట్స్‌ కీర్తించారు. ఎన్నికల వేళ బిల్‌ గేట్స్‌ లాంటి నుంచి ఇలాంటి ప్రశంసలు రావడం మోదీ ప్రభుత్వానికి బాగా ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Tags:    

Similar News