బిల్ గేట్స్... ఈ పేరు వినగానే కంప్యూటర్ యుగ వైతాళికుడే మన కళ్లకు కనబడతారు. అంతేనా... మైక్రోసాఫ్ట్ కంపెనీ ద్వారా తాను సంపాదించిన దానిలో మెజారిటీ శాతాన్ని దాతృత్వానికే ఖర్చు పెట్టిన మహోన్నత వ్యక్తే కదలాడతారు. అంతేకాదండోయ్... ఓ నిర్ధిష్టమైన వయసు రాగానే కంపెనీ నుంచి వైదొలగి తన తర్వాతి తరానికి అవకాశం కల్పించిన మార్గదర్శి కూడా మనకు కనిపిస్తారు. అయితే ఇవన్నీ నిన్నటిదాకా. 27 ఏళ్లుగా తన జీవన సహచరిగా సాగుతున్న మిలిండా గేట్స్ కు విడాకులు ఇచ్చిన మరుక్షణమే గేట్స్ కు సంబంధించి మరో కోణం వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ వార్తల సారాంశమంతా ఒక్కటే. అదేంటంటే... బిల్ గేట్స్ మనకు తెలిసినంత కాదు. వయసులోనే కాకుండా పెళ్లి చేసుకున్నాక కూడా మహా గ్రంథసాంగుడేనట. ఈ కోణంలో ఇప్పుడు పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి.
ఈ తరహా కథనాల్లో తాజాగా బ్రిటన్ కు చెందిన ఓ పత్రిక... బిల్ గేట్స్ బయోగ్రఫీ రాసిన జేమ్స్ వాలేస్ ను ఊటంకిస్తూ సంచలన కథనాన్ని రాసింది. గేట్స్ తన యుక్త వయసులోనే కాకుండా మధ్య వయసులోనూ సాగించిన రాచకార్యాలను వాలేస్ తనదైన శైలిలో విపులంగానే రాసినట్లు సదరు పత్రిక తెలిపింది. యువకుడిగా ఉండగా... తన ఇంటిలోనే న్యూడ్ పార్టీలను గేట్స్ నిర్వహించిన తీరును కూడా వాలేస్ చాలా వివరంగా రాసుకొచ్చారు. కంప్యూటర్ యుగంలో గేట్స్ ప్రస్థానాన్ని *ఓవర్ డ్రైవ్: బిల్ గేట్స్ అండ్ ద రేస్ టూ కంట్రోల్ సైబర్ స్పేస్* పేరిట 1997లో వాలేస్ రాశారు. ఇందులోనే గేట్స్ రాచకార్యాలన్నింటినీ ఆయన ఏమాత్రం మొహమాటం లేకుండానే ప్రస్తావించారు.
1988లో మిలిండాతో డేటింగ్ ప్రారంభించే నాటికే గేట్స్ తనదైన శైలిలో మిత్రులతో కలిసి ఎంజాయ్ చేసేశారని వాలేస్ తన పుస్తకంలో రాసుకొచ్చారు. బార్ డ్యాన్సర్లను వాషింగ్టన్ లోని తన ఇంటికి పిలిపించుకునే గేట్స్ తన మిత్రులతో కలిసి వారితో ఎంజాయ్ చేసేవారట. అంతేకాకుండా తన ఇంటిలోని స్విమ్మింగ్ పూల్ లో లేడీ డ్యాన్సర్లు, తన మిత్రులతో కలిసి న్యూడ్ పార్టీలు చేసుకునేవారని కూడా వాలేస్ రాశారు. ఇక 1988లో మిలిండాతో డేటింగ్ మొదవలయ్యాక కూడా గేట్స్ ఇతర మహిళలతో సంబంధాలను నెరిపేవారట. ప్రత్యేకించి బిజినెస్ టూర్ల మీద ఇతర ప్రాంతాలకు వెళ్లిన సమయంలో మిలిండా తన పక్కన లేని సమయంలో ఇతర మహిళలతో గేట్స్ ఎంజాయ్ చేసేవారట. బిజినెస్ జర్నలిస్టులు, ప్రత్యేకించి మైక్రోసాఫ్ట్ వార్తల కవరేజీ కోసం వచ్చే మహిళా జర్నలిస్టులతో గేట్స్ సంబంధాలు కొనసాగించారట. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయాన్ని వాలేస్ ప్రస్తావించారు. గేట్స్ రాచకార్యాలన్నీ కూడా మిలిండాకు ముందే తెలుసట. అంతేకాకుండా మీడియాకు కూడా గేట్స్ గురించి తెలిసినా... వాటిని పెద్దగా ఎక్స్ పోజ్ చేయలేదని కూడా వాలేస్ పేర్కొన్నారు.