బిట్ కాయిన్..ఈ పదం గురించి టెక్నాలజీ పట్ల అవగాహన ఉన్న ఎవరికీ పరిచయం అవసరం లేదు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు గతేడాది రాకెట్ స్పీడుతో ఆకాశాన్ని తాకిన బిట్ కాయిన్ మెల్లగా మళ్లీ నేలకు దిగి వస్తోంది. బుధవారం ఏకంగా 11 శాతం పతనమైంది ఈ క్రిప్టోకరెన్సీ. లగ్జెమ్ బర్గ్ బిట్ స్టాంప్ ఎక్స్ చేంజ్ లో బిట్ కాయిన్ విలువ 10065 డాలర్లకు పడిపోయింది. గతేడాది డిసెంబర్ లో ఇది 20 వేల డాలర్ల సమీపానికి వెళ్లిన విషయం తెలిసిందే. బిట్ కాయిన్ తోపాటు ఇతర క్రిప్టో కరెన్సీలు కూడా దారుణంగా పడిపోయాయి.
ఇందుకు రకరకాల కారణాలు ఉన్నట్లు ట్రేడింగ్ నిపుణులు చెప్తున్నారు. సౌత్ కొరియా - చైనాలాంటి దేశాలు క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ను నిషేధిస్తాయన్న వార్తల నేపథ్యంలో వీటి విలువ పతనమైంది. దొరికినకాడికి అమ్ముకొని బయటపడదామని అందరూ భావిస్తున్నట్లు క్రిప్టోకంపేర్ సంస్థ ఫౌండర్ చార్లెస్ హేటర్ తెలిపారు. క్రిప్టోకరెన్సీలపై వివిధ దేశాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వీటి విలువ మరింత పతమవడం ఖాయమని ఆయన అంచనా వేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీల నియంత్రణ చర్యలు ఊపందుకుంటున్నాయి. సౌత్ కొరియా - జపాన్ - చైనా వీటి నిషేధంపై ఆలోచిస్తుండగా.. ఫ్రాన్స్ - అమెరికాలాంటి దేశాలు క్రిప్టోకరెన్సీలపై విచారణ జరపనున్నట్లు ప్రకటించాయి.
ఇదిలాఉండగా...మార్చిలో జరగనున్న జీ20 సదస్సులోనూ వీటిపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది బిట్ కాయిన్ ఏకంగా 2000 శాతం పెరిగిన విషయం తెలిసిందే. రోజురోజుకూ పడిపోతూ వస్తున్న బిట్ కాయిన్ విలువ.. బుధవారం నాలుగు నెలల కనిష్ఠానికి చేరింది. క్రిప్టోకరెన్సీల్లో ట్రేడింగ్ ను నిషేధించడాన్ని పరిశీలిస్తున్నట్లు సౌత్ కొరియా ఆర్థిక మంత్రి ప్రకటించడంతో బిట్ కాయిన్ విలువ దారుణంగా పతనమైంది.