బిట్ కాయిన్ తృటిలో తప్పించుకున్నది. మనదేశంలో బిట్ కాయిన్ పై నిషేధం విధించడం ఖాయమని అందరు అంచనా వేశారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులు బిట్ కాయిన్ లావాదేవీలపై పూర్తి నెగిటివ్ గా ఉన్న కారణంతో దీనిపై నిషేధం తప్పదనే అనుకున్నారు. ఇదే సమయంలో తాజాగా ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ మేరకు బిల్లు కూడా రెడీ అయ్యిందని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది.
ఇలాంటి నేపధ్యంలోనే బిట్ కాయిన్ ను కేంద్ర ప్రభుత్వం కరెన్సీగా గుర్తించేది లేదని ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టంగా ప్రకటించారు. బిట్ కాయిన్ చెలామణిపై పార్లమెంటులో చర్చ జరిగినపుడు ఆర్థిక మంత్రి పై ప్రకటన చేశారు. అంతేకానీ నిషేధం విషయంపై ఏమీ మాట్లాడలేదు. అంటే బిట్ కాయిన్ను ఇప్పటికిప్పుడు మనదేశంలో నిషేధించేది లేదని అందరికీ అర్ధమైపోయింది. కాకపోతే కరెన్సీగా ప్రభుత్వం గుర్తించదని మాత్రమే చెప్పారు.
అంటే సంపూర్ణ నిషేధం నుండి బిట్ కాయిన్ తృటిలో తప్పించుకున్నదనే అనుకోవాలి. మరి భవిష్యత్తు సంగతిని ఇపుడే చెప్పలేమని ఆర్థిక రంగ నిపుణులు, బ్యాంకింగ్ రంగ నిపుణులు కూడా చెబుతున్నారు. నిజానికి మనదేశంలో బిట్ కాయిన్ పై పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ లావాదేవీల్లో ఎక్కడైనా మోసం జరిగిందని ఎవరైనా ఆరోపించినా ఎవరు ఏమీ చేయగలిగేది ఏమీలేదు. ఎందుకంటే లాభాలొచ్చినా, నష్టాలొచ్చినా వ్యక్తుల వ్యక్తిగత హోదాలో జరిగిపోతాయి.
దీనికి ప్రభుత్వం గుర్తింపు, నియంత్రణ లేదు కాబట్టి ప్రభుత్వం చేయగలిగేదీ లేదు. ఎవరిమీద యాక్షన్ తీసుకోవాలో కూడా ఎవరికీ తెలీదు. ఇది మనదేశంలోని పరిస్ధితే కాదు. బిట్ కాయిన్ లావాదేవీలు జరుగుతున్న అన్ని దేశాల పరిస్థితి ఇదే. ప్రపంచం మొత్తం మీద ఒక్క ఎల్ సాల్వడార్ దేశంలో మాత్రమే బిట్ కాయిన్ కు అధికారిక కరెన్సీగా గుర్తింపుంది. మనదేశంలో బిట్ కాయిన్ లేదా ఇలాంటి క్రిప్టో కరెన్సీకి సుమారు 2 కోట్లమంది వాటాదారులున్నారు. ఇప్పటివరకు క్రిప్టో కరెన్సీలో మనదేశంలో సుమారు రు. 75 వేల కోట్లు పెట్టుబడులు పెట్టారు.
రాత్రికి రాత్రికి లక్షాధికారులు, కోటీశ్వరులైపోయే అవకాశాలున్న కారణంగానే చాలామంది దీనిలో పెట్టుబడులు పెట్టడానికి బాగా ఇష్టపడుతున్నారు. లాభానికి ఎంత అవకాశం ఉందో నష్టానికి కూడా అంతే అవకాశాలున్న విషయం తెలుసు. కాకపోతే మనకు లాభాలు రాకపోతాయా అన్న ఆశతోనే పెట్టుబడులు పెట్టేస్తున్నారు. క్రిప్టోకరెన్సీ లావాదేవీలను నియంత్రించే అవకాశం కేంద్రానికి ఉన్నప్పటికీ ఎందుకనో ఉపేక్షిస్తోంది. దీని సాకుగా తీసుకుని పెట్టుబడిదారులు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నారు.
మనదేశంలో నిషేధం ఖాయమని అనుకునే క్రిప్టోకరెన్సీ ఆపరేటర్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్ కు తమ ఆఫీసులను మార్చేయాలని డిసైడ్ అయ్యాయి. అయితే గుర్తింపు లేదని మాత్రమే చెప్పిన కేంద్రం నిషేధం గురించి ఏమీ చెప్పకపోవటంతో ప్రస్తుతానికి గండం గడిచినట్లే అని అనుకుంటున్నారు. మరి ముందు ముందు ఏమి జరుగుతుందో చూడాలి. క్రిప్టో కరెన్సీలో ఎన్ని రకాలున్నా బిట్ కాయిన్ మాత్రమే రారాజులా చెలామణి అవుతోంది.