కర్ణాటకలో జరిగిన 15 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 12 చోట్ల బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉప ఎన్నికల తొలి ఫలితం వచ్చేసింది. యెల్లపూర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ గెలిచింది. భారీ ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి శివరాం గెలిచాడు. మిగతా 11 చోట్ల బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతూ గెలుపు వాకిట ఉన్నారు.
కర్ణాటకలో ప్రస్తుతం 105 ఎమ్మెల్యేలు బీజేపీకి ఉన్నారు. అసెంబ్లీలో మొత్తం 225 మంది కాగా.. మేజిక్ మార్క్ 113. దీంతో బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో 15 సీట్లలో కనీసం 9 గెలిస్తేనే ప్రభుత్వం నిలబడుతుంది. లేదంటే పడిపోతోంది.కానీ కన్నడ ప్రజలు మాత్రం బీజేపీకే పట్టం కట్టబోతున్నారని తెలుస్తోంది. యడ్యూరప్ప సర్కారు ఉప ఎన్నికల ఫలితాలతో మేజిక్ మార్క్ దాటబోతోంది.
ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ - జేడీఎస్ లకు నిరాశ ఎదురవుతోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు చోట్ల మాత్రమే ప్రభావం చూపుతోంది. దీంతో కన్నడ కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పును శిరసావహిస్తానని తెలిపారు. ప్రజలు ఫిరాయింపుదారులకే మద్దతిచ్చారని ఆయన పేర్కొన్నారు. దీంతో తాము నిరాశ పడమని తెలిపారు.