క‌న్న‌డిగుల‌కు గ‌జ‌నీ గుర్తుకు వ‌చ్చేలా చేశార‌ట‌!

Update: 2019-07-24 05:50 GMT
కాసింత క‌టువుగా ఉన్నా.. ఇది నిజం. అధికార‌ప‌క్షంలో ఉన్న ప్ర‌భుత్వంలోని కీల‌క వ్య‌క్తుల చొర‌వ‌తో తాము టార్గెట్ చేసిన రాష్ట్రంలో రాజ‌కీయ సంక్షోభాన్ని సృష్టించి.. అక్క‌డి ప్ర‌భుత్వాన్ని ప‌డేసే ప్లాన్ చేయ‌టం. ఇందుకోసం భారీ ఎత్తున ప్ర‌య‌త్నాలు చేయ‌టం చూస్తే.. అప్పుడెప్పుడో ఢిల్లీ సింహాస‌నాన్ని చేజిక్కించుకోవ‌టం కోసం గ‌జ‌నీ మ‌హ్మ‌మ‌ద్ చేసిన ప్ర‌య‌త్నాలు గుర్తుకు రాక మాన‌వు. దాదాపు 17 సార్లు ప్ర‌య‌త్నించి.. ఎదురుదెబ్బ‌లు తిన్న‌ప్ప‌టికీ తాను అనుకున్న‌ది సాధించిన వైనం చ‌రిత్ర‌లో అలా నిలిచిపోయింది.

అందుకే.. అదే ప‌నిగా ప్ర‌య‌త్నిస్తుంటే.. ఏం గ‌జ‌నీ మ‌హ్మ‌ద్ లా ప్ర‌య‌త్నిస్తున్నావే అన్న నానుడి ఉంది. అప్ప‌టి గ‌జ‌నీ మ‌హ్మ‌ద్ ను మ‌ళ్లీ గుర్తు చేసేలా బీజేపీ అధినాయ‌క‌త్వం వ్య‌వ‌హ‌రించింద‌ని చెప్పాలి. క‌ర్ణాట‌క‌లో అధికారాన్ని చేప‌ట్టేందుకు ఆప‌రేష‌న్ క‌మ‌లం నిర్వ‌హించి.. ఎదురుదెబ్బ‌లు తిన్న‌ప్ప‌టికీ వెన‌క్కి త‌గ్గ‌ని బీజేపీ నేత‌లు ఎట్ట‌కేల‌కు తాజాగా కుమార‌స్వామి ప్ర‌భుత్వాన్ని కూల‌దోయ‌టంలో స‌క్సెస్ అయ్యార‌ని చెప్పాలి.

క‌ర్ణాట‌క‌లో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభం.. ఊహించ‌ని రీతిలో ప‌లు మ‌లుపులు తిర‌గ‌టం.. ఎత్తుల‌కు పైఎత్తులు వేసే క్ర‌మంలో సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌టం తెలిసిందే. ఈ  ఎపిసోడ్ లెక్క తేల్చేందుకు గ‌వ‌ర్న‌ర్ త‌న తీరుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించి స్పీక‌ర్ కు ఆదేశాలు జారీ చేస్తే.. అందుకు ప్ర‌తిగా.. త‌న‌కు టైం లిమిట్ పెట్టలేరంటూ ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు రానున్న రోజుల్లో దేశ రాజ‌కీయాల్లోని బ‌ల‌హీన‌త‌ల్ని చెప్పేస్తుంద‌ని చెప్పాలి.

క్రీస్తుశ‌కం 1000-1026 మ‌ధ్య కాలంలో గ‌జ‌నీ మ‌హ్మ‌ద్ భార‌త్ మీద దండెత్తి త‌న చిర‌కాల వాంఛను తీర్చుకున్నారు. కాస్త అటు ఇటుగా మ‌ళ్లీ వెయ్యేళ్ల త‌ర్వాత‌.. ప్ర‌జాస్వామ్య భార‌తంలో ఆధునిక స‌మాజంలో రాజ‌కీయంగా త‌మ ప్ర‌త్య‌ర్థుల చేతిలో ఉన్న అధికారాన్నిచేజిక్కించుకోవ‌టానికి మోడీషాలు నెల‌ల త‌ర‌బ‌డి వ్యూహాలు వేసి.. ప‌లుసార్లు ప్ర‌య‌త్నించి.. ఎట్ట‌కేల‌కు తాజాగా ఎపిసోడ్ లో క‌న్న‌డ నాట కుమార‌స్వామి ప్ర‌భుత్వాన్ని విజ‌య‌వంతంగా కూల‌దోయ‌గ‌లిగార‌ని చెప్పాలి. వెయ్యేళ్ల‌లో నాగ‌రిక‌త ఎంత మారినా..  మ‌నుషుల్లో తాము కోరుకున్న‌ది సొంతం చేసుకోవాలి..అధికారాన్ని చేజిక్కించుకోవ‌టానికి దేనికైనా సిద్ధ‌మ‌వ్వాల‌న్న బేసిక్ పాయింట్లో మాత్రం మార్పు లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం. త‌మ తీరుతో ఇన్నాళ్ల‌కు గ‌జ‌ని మ‌హ్మ‌ద్ ను గుర్తు చేసిన మోడీషాల‌కు థ్యాంక్స్ చెప్పాలేమో. ఇంత‌కూ.. గ‌జ‌నీ మ‌హ్మ‌ద్ ను మోడీషాలు ఇష్ట‌ప‌డ‌తారంటారా?


Tags:    

Similar News