ఉత్తరప్రదేశ్ మొత్తంగా బీజేపీ గాలి వీచింది. ఈ దెబ్బకు 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయింది. కనీసం రెండంకెల సీట్లు కూడా దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ తరుఫున రాహుల్, ప్రియాంక అన్నీ ఓన్ చేసుకొని పోటీచేసినా కూడా ఫలితం దక్కలేదు. రెండోసారి బీజేపీనే అధికారం కొల్లగొట్టింది. ఈ ప్రాంతం.. ఆ ప్రాంతం అనే తేడా లేకుండా రాష్ట్రం మొత్తం యోగి ఆదిత్యనాథ్ పాలనపై జనాలు సానుకూలత చూపించారు. ఈ ఎన్నికల్లో చాలా పార్టీలు పోటీచేసినా బీజేపీ, ఎస్పీ తప్ప మరే పార్టీయేది మంచి ఫలితాలు రాబట్టుకోలేకపోయింది.
కాంగ్రెస్ పరిస్థితి యూపీలో ఘోరంగా తయారైంది. మాయావతి పార్టీ బీఎస్పీ పూర్తిగా దెబ్బతింది. నాలుగు సార్లు సీఎంగా పనిచేసిన మాయావతి పార్టీ కూడా దారుణంగా ఓడిపోయింది. కాంగ్రెస్ తరుఫున యూపీ అంతా వందలాది మంది పార్టీ అభ్యర్థులు పోటీచేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఇంతటి వ్యతిరేక వాతావరణంలోనూ కాంగ్రెస్ తరుఫున ఒక అభ్యర్థి పోటీచేసి గెలిచారు. సదురు అభ్యర్థిని గ్రేట్ అనక తప్పదు. పార్టీ తరుఫున గెలిచిన ఒకే ఒక అభ్యర్థి ఎవరంటే ఆమె ‘ఆరాధనా మిశ్ర’. ఈమె మాత్రమే ఇక్కడ నుంచి ఎందుకు గెలిచారంటే దీనికొక చరిత్ర ఉంది. యూపీలో ‘రాంపుర్ ఖాస్’ అని నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట.. ఈ నియోజకవర్గంలో 1980 నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తప్ప మరొకరు గెలిచిన చరిత్ర లేదు.
బీజేపీ గాలి వీచిన.. ఎస్పీ, బీఎస్పీ ప్రభంజనంలోనూ ఈ నియోజకవర్గంలో గెలవలేకపోయాయి. మిగిలిన పక్క నియోజకవర్గాలన్నీ గెలిచినా ఈ రాంపూర్ ఖాస్ ను మాత్రం కాంగ్రెస్ నుంచి ఏ పార్టీ గెలుచుకోలేకపోయింది.
1980లో రాంపూర్ ఖాస్ నుంచి మొదటిసారి ఈ నియోజకవర్గంలో ప్రమోద్ తివారి గెలిచారు. 1985,1989,1991,93,96,2002,2007,2012 ఎన్నికల్లో తివారీయే గెలిచారు. 2013లో తివారీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. దాంతో 2014లో ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో తివారీ కూతురు ఆరాధనా మిశ్ర పోటీచేసి గెలిచారు. తర్వాత 2017లోనూ ఆమెనే గెలిచారు.
తాజాగా మళ్లీ ఈ ఎన్నికల్లో కూడా ఆరాధాన మిశ్రాయే గెలిచారు. తొమ్మిది ఎన్నికల్లో తండ్రి, మూడు ఎన్నికల్లో కూతురు గెలవడమంటే వీళ్లకున్న రికార్డును అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రమంతా కాంగ్రెస్ ఓడిపోయినా.. ఒక్క రాంపూర్ ఖాస్ లో మాత్రం తివారీ కుటుంబమే ఎందుకు గెలుస్తుందో ఇప్పటికీ మిస్టరీగా ఉంది. వారు చేసిన అభివృద్ధియే వారిని గెలిపిస్తుందని అంటున్నారు.