కేంద్రంలో బీజేపీ పాలన ప్రారంభమైన నాటి నుంచి సంస్కరణల పేరుతో అనేక చారిత్రక ప్రదేశాలకు.. పథకాలకు.. కార్యక్రమాలకు పేరు మారుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. కాంగ్రెస్ గత పాలకులు పెట్టిన పేర్లను మోడీ సర్కారు రాత్రికి రాత్రి సైలెంట్‌గా మార్చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. రాజీవ్ ఖేల్ రత్న వంటి పురస్కారానికి.. ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా మార్చి షాకిచ్చారు. అలాగే ఢిల్లీలో వీధులకు కూడా పేర్లు మార్చారు.
ఇక, కొన్ని దశాబ్దాలుగా.. ముడిపడకుండా.. రామ జన్మభూమిని సాధించారు. ఇక, ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత ప్రేమ సౌధం తాజ్ మహల్ పైనా.. బీజేపీ నాయకుల చూపు పడిందనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి దీనికి సంబంధించి.. కొన్ని నెలలుగా.. బీజేపీ నాయకులు వింత వింత కామెంట్లు చేస్తున్నారు. అసలు.. అది షాజహాన్ కట్టించిందే అయినా.. ఆ స్థలంతమ పూర్వీకులదని.. దానిని తమకు అప్పగించాలని.. రాజస్థాన్‌కు చెందిన బీజేపీ ఎంపీ ఒకరు కొన్ని రోజుల కిందట కేసు వేశారు. ప్రస్తుతం ఇది విచారణ దశలో ఉంది.
ఇప్పుడు తాజాగా.. తాజ్ మహల్ పేరును `తేజో మహాలయ`గా మార్చాలని బీజేపీ కౌన్సిలర్ శోభారామ్ రాథోడ్ ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఆయన ఆగ్రా నగర పాలక సంస్థకు సమర్పించారు. దీనిపై నగర పాలక సంస్థ సభ్యులు తదుపరి నిర్ణయం తీసుకుంటారు. అంతేకాదు.. తాజ్ మహల్‌లో కమలంతో కూడిన కలశం ఉన్నట్లు రుజువులు తన వద్ద ఉన్నాయని శోభారాం రాథోడ్ తన ప్రతిపాదనలో పేర్కొన్నట్లు తెలిసింది.
తాజ్ మహల్ గురించి అసలు నిజాలు తెలుసుకునేందుకు దానిలో తాళాలు వేసి ఉన్న 22 గదులను తెరవాలని కొన్ని నెలల క్రితం అలహాబాద్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దానిని హైకోర్టు తోసిపుచ్చింది. ఇదిలావుండగా, తాజ్ మహల్ వాస్తవానికి ఓ శివాలయమని, ఈ విషయాన్ని ప్రాచీన గ్రంథాలు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రికార్డులు చెప్తున్నాయని కొందరు వాదిస్తున్నారు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మాట్లాడుతూ, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తాజ్ మహల్ పేరును `రామ్ మహల్`గా మార్చుతుందని చెప్పారు.
అయితే.. దీనిపై యోగి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ తరుణంలో.. బీజేపీ తెరచాటుగా ముందు కింది స్థాయి నాయకులను ప్రోత్సహించి.. కేసులు వేయించడం ద్వారా.. నెమ్మదిగా విషయాన్ని జాతీయకరణచేసి.. దీనిపై చర్చ జరిగేలా.. చూస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
అనంతరం.. తనకు నచ్చినట్టుగా.. మార్పులు చేయడం ఖాయమని అంటున్నారు.ఇప్పటి వరకుజరిగిన పరిణామాలు ఈ విషయాన్నే రుజువు చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా తాజ్ మహల్ కూడా ఈజాబితాలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.