కమలనాథుల తెలివి మామూలుగా ఉండదు. మోడీ పుణ్యమా అని ఆ పార్టీలో కనిపించే కరకుదనం మరే రాజకీయ పార్టీలోనూ కనిపించదు. ప్రత్యర్థి రాజకీయ పార్టీల విషయంలో ఎంత కర్కసంగా వ్యవహరిస్తారో వారిని చూసే నేర్చుకోవాలి. తప్పును తప్పుగా ఎత్తి చూపినా.. వెంటనే దానికి కౌంటర్ అటాక్ చేస్తారే తప్పించి.. తప్పును ఒప్పుకునేందుకు అస్సలు ఇష్టపడని తత్త్వం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామం దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు.
అండర్ వరల్డ్ డాన్ రవి పూజారిని ఆఫ్రికా పోలీసులు అరెస్ట్ చేయటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ ను తమకు అనుకూలంగా కమలనాథులు మార్చుకోవటం.. తమ ఘనతగా గొప్పలు చెప్పుకోవటం తెలిసిందే. దీంతో ..ఒళ్లు మండిన కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి ఘాటు ట్వీట్ తో కమలనాథులకు షాకిచ్చారు.ఆఫ్రికా పోలీసులు అరెస్ట్ చేస్తే.. మీ ఘనతగా గొప్పలు చెప్పుకోవటం ఏమిటంటూ తప్పు పట్టారు. అంతే.. కమలనాథులు అలెర్ట్ అయ్యారు. తమను డిఫెన్స్ లో పడేలా.. తమకొచ్చే మైలేజీని దెబ్బ తీసేలా ఉన్న కుమారస్వామి ట్వీట్ పై కమలనాథులు విరుచుకుపడ్డారు.
సంబంధం లేని అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఆపరేషన్ కమలతో బెదిరి ఇటీవల రిసార్ట్ రాజకీయాన్ని నడిపిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గొడవపడి కొట్టుకున్న అంశాన్ని తెర మీదకు తెచ్చారు. బిడిది రిసార్టులో తోటి ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ పై దాడి చేసిన కంప్లి ఎమ్మెల్యే గణేష్ ను అరెస్ట్ చేసి సత్తా చాటుకోడంటూ సవాలు విసిరారు. ముందు ఎమ్మెల్యే గణేష్ ను అరెస్ట్ చేయండి.. తర్వాత మాట్లాడండి అంటూ ఫైర్ అవుతున్నారు.
తాజా ఉదంతానికి కొత్త వాదనను తీసుకొస్తూ.. బిన్ లాడెన్ ను అమెరికా ప్రభుత్వం హతమారిస్తే క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునే రీతిలో కొందరు యత్నించారని.. అలాంటి తరహాలో వ్యవహరించటం సరికాదన్న మాటల్ని చెబుతున్నారు కమలనాథులు. ఏమైనా సరే.. తప్పు చేసినా దాన్ని కవర్ చేసుకోవటం.. ప్రత్యర్థి పార్టీలపై మూకుమ్మడి విమర్శల దాడిలో కమలనాథులకున్న నేర్పు అంతా ఇంతా కాదన్నది మాత్రం సత్యం.