తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ సృష్టించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన భవన నిర్మాణ రంగం సమావేశంలో మంత్రి కేటీఅర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తన మిత్రుడు తెలంగాణ వారిని బస్సులో ఆంధ్రకు తీసుకొని వచ్చి, అక్కడ రోడ్లు, విద్యుత్ సరఫరా ఎంత అధ్వానంగా ఉందో చూపించాలని కోరినట్లు మంత్రి తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు.
దీనిపై ఇప్పటికే ఏపీలో అధికార వైసీపీ మండిపడుతోంది. మరోవైపు ప్రతిపక్ష టీడీపీ మాత్రం... కేటీఆర్ కామెంట్లు నిజమేనంటూ మద్దతు ఇస్తోంది. ఈ సమయంలో బీజేపీ ఫైర్‌బ్రాండ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాత్రం మంత్రి కేటీఆర్ మాటలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ ఫ్రెండ్ ఎవరో చెప్తే.. తెలంగాణలోని అధ్వానం చూపిస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు
మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై డీకే అరుణ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. కేటీఅర్ స్నేహితుడు కేవలం కల్వంకుంట్ల వారి ఫార్మ్ హౌస్ చుట్టుప్రక్కల ప్రాంతాలు చూసి , మొత్తం రాష్ట్రం అంతా అదే విధంగా ఉంటుందన్న భ్రమలో ఉన్నటున్నారని డీకే అరుణ ఎద్దేవా చేసారు. కేటీఆర్ తన మిత్రుడు ఎవరో చెప్తే, తాను స్వయంగా అతడిని గద్వాలతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు తీసుకొని వెళ్ళి, అక్కడ రోడ్లు, నీటి, విద్యుత్ సరఫరా ఎంత ఘోరంగా ఉన్నాయో చూపిస్తానని వ్యాఖ్యానించారు. సొంత డబ్బా కొట్టుకోవడంలో కేటీఆర్ సిద్ధహస్తుడన్న విషయం యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసన్నది కేటీఅర్ మర్చినట్టు ఉన్నారని డీకే అరుణ చురకలు అంటించారు.
కాగా, ఏపీని ఉద్దేశించి పరోక్షంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ``నాకో మిత్రుడు ఉన్నాడు.. ఆయన సంక్రాంతి పండుగకు పక్క రాష్ట్రానికి వెళ్లాడు.. ఆయనకు అక్కడ తోటలు, ఇల్లు ఉంది.. వెళ్లి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసిండు.. కేటీఆర్ గారు మీరు ఒక పనిచేయండి… రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి నాలుగు బస్సులు పెట్టి పక్క రాష్ట్రానికి పంపించండి.. అని చెప్పారు.. ఎందుకని అడిగితే.. అక్కడ కరెంట్ లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమైపోయాయి.. అన్యాయంగా.. అధ్వానంగా ఉందని చెప్పాడు.. మళ్లీ తిరిగొచ్చిన తర్వాతే ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉందని.. పక్క రాష్ట్రాన్ని చూసివస్తేనే.. మనం చేస్తున్న అభివృద్ధి తెలిసి వస్తుందని చెప్పారు. `` అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లపైనే ఇప్పుడు రాజకీయ రగడ జరుగుతోంది.