వకీల్ సాబ్ తో బీజేపీ పాలిటిక్స్ చేస్తోందా?

Update: 2021-04-09 09:48 GMT
తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలాగైనా సరే కాస్తో కూస్తో ప్రభావం చూపాలని తపన పడుతున్న బీజేపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను తమ ఆయుధంగా చేసుకుందా? తాజాగా వకీల్ సాబ్  చిత్రానికి ఏపీలో అడ్డంకులను బూచీగా చూపాలని ప్లాన్ చేసిందా? పవన్ సినిమాకు ఏపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తోందా? అంటే ఔననే అంటున్నాయి రాజకీయవర్గాలు.

ఈరోజు వకీల్ సాబ్ మూవీ రిలీజ్ అయ్యింది. అయితే దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం దృష్ట్యా ఏపీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు కరోనా నిబంధనలు పాటించేలా చూడాలని ప్రభుత్వాలను ఆదేశించాయి. బార్లు, వైన్స్, సినిమా హాళ్లలో కఠిన నిబంధనలు అమలు చేయాలని.. కరోనా కేంద్రాలుగా ఉన్న వీటి విషయంలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వరాదని స్పష్టం చేసింది.

అయితే కోర్టు ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వం అమలు చేసింది. ఈ మేరకు జీవో జారీ చేసింది.  వకీల్ సాబ్ బెనిఫిట్స్ షోలు, ప్రీ షోస్ ను రద్దు చేసింది. నిజానికి ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా దీన్ని స్వతహాగా అమలు చేశారు. జ‌గ‌న్ స‌ర్కారు కరోనా ప్రబలుతున్న దృష్ట్యా ఎక్స్ ట్రా షోలు వేయడానికి రేట్లు ఇంతే ఉండాలంటూ జీవో జారీచేసింది. దీనిపై బీజేపీ సహా జనసేన నాయకులు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  

 ఏపీలో హైకోర్టు ఆదేశానుసారం.. సినిమా విడుద‌ల‌కు ముందే టికెట్ ధ‌ర‌లు పెంచొద్దంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ప్ర‌భుత్వం జీవో ప్రకారం డిస్ట్రిబ్యూట‌ర్లు హైకోర్టుకు వెళ్లగా  కరోనా నేపథ్యంలో కఠినంగా అమలు చేయాలని సూచించింది. దీంతో ఏపీలో బెనిఫిట్ షోలను ఏపీ సర్కార్ రద్దు చేసింది. ఈ జీవో ప్ర‌కారం.. మల్టీఫ్లెక్స్ ల‌లో, కార్పొరేష‌న్ ప్రాంతాల్లో ప్రీమియం టికెట్ ధ‌ర రూ.250 మాత్ర‌మే ఉండాలి. మిగిలిన టిక్కెట్లు రూ.150, 100 మాత్ర‌మే ఉండాలి. సింగిల్ థియేట‌ర్ల‌లో ఏసీ ఉంటే వంద‌, లేదంటే రూ.60 మాత్ర‌మే ఉండాని ఆదేశాలు జారీచేసింది.

అయితే పవన్ సినిమాకు అన్యాయం చేస్తున్నారని తాజాగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ సహ ఇన్ చార్జి సునీల్ ధియేదర్ అయితే జగన్ ‘వకీల్ సాబ్’కు భయపడుతున్నారని విమర్శిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తుంటే.. దాన్ని కూడా రాజకీయం చేయడం తగదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. సినిమాల కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యమని.. సినిమాల్లో సమూహాలుగా చూస్తే కరోనా ప్రబలితే ఎవరు కారణం అని.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సహేతుకమే అని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News