భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచకప్ టోర్నమెంట్ తర్వాత ఎప్పుడైనా రిటైర్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి. ఈ ప్రపంచ కప్‌లో ధోనీ ఆటతీరు అంచనాలు అందుకోలేక పోయిందని సీనియర్ల నుంచి తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ధోనీ సైతం ప్రపంచకప్ తర్వాత ఎన్ని రోజులు క్రికెట్ ఆడతానో తనకే తెలియదని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ లో భారత్ ఇప్పటికే సెమీఫైనల్ కు చేరుకుంది. వారం రోజుల్లో టోర్నమెంట్ ముగుస్తుంది. ఆ తర్వాత ధోని పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా ? అంటే అవుననే అంటున్నాయి జాతీయ మీడియా - రాజకీయ వర్గాలు.
ఈ క్రమంలోనే రిటైర్ మెంట్ తర్వాత ధోనీ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ బిజెపి అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం మొదలెట్టేశారు. అంతే కాదు ధోనీతో పాటు... కేంద్ర హోం మంత్రి - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కలిసి ఉన్న ఫోటోలను కూడా ఉదాహరణగా చూపిస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో గెలుపే టార్గెట్ గా పనిచేస్తోన్న బిజెపి దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ కాషాయం జెండా ఎగరాలన్న టార్గెట్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది డిసెంబర్ లో జార్ఖండ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ధోనీ పాపులారిటీని ఉపయోగించుకుని అక్కడ పాగా వేయాలన్న ప్లాన్ తో ఉన్నట్టు తెలుస్తోంది.
జార్ఖండ్ లో జేఎంఎం - ఆర్జేడీ - కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కోవాలంటే ఇలాంటి ప్రజాదరణ ఉన్న క్రీడాకారుడు అవసరమని బిజెపి భావిస్తోందట. బిజెపిలో చేరేందుకు ధోనీ ఇష్టపడని క్రమంలో కనీసం ప్రచారానికి అయినా రప్పించాలని భావిస్తోందట. తాజా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎంతోమంది సినీనటులు - క్రీడాకారులను ఎంపీలుగా పోటీ చేయించి సక్సెస్ అయ్యింది. మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ - భోజ్ పురి నటుడు మనోజ్ తివారి ఢిల్లీ నుంచి - నటులు రవికిషన్ యూపీలోని ఘోరఖ్ పూర్ నుంచి ఎంపీలుగా గెలిచారు. మరో నటుడు సన్నీడియోల్ పంజాబ్ లోని గురుదాస్ పూర్ ఎంపీ అయ్యారు.
ఈ క్రమంలోనే ధోనీని జార్ఖండ్ ఎన్నికల్లో వాడుకుని... ఆ వెంటనే రాజ్యసభకు నామినేట్ చేయాలన్న ఆలోచనలో ఉందట. మరి ఈ డీల్‌ను ధోనీ కోసం బీజేపీ రెడీ చేసినా... ధోనీ మనస్సులో ఏముందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.