రాఫెల్ పై రివ్యూ.. బీజేపీకి మళ్లీ జలక్

Update: 2019-01-02 08:55 GMT
బీజేపీని రాఫెల్ వివాదం వీడటం లేదు. తాజాగా సుప్రీం కోర్టు క్లీన్ చీట్ ఇచ్చినా ఇంకా లోసగులు ఉన్నాయని రివ్యూ పిటషన్ దాఖలైంది. దీంతో బీజేపీ మరోమారు షాక్ తిన్నది.

రాఫెల్ యద్ధవిమానంలో కొనుగోలులో చోటుచేసుకున్న అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ  పోరాటం చేస్తోంది.. ఈ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తేలేదని చెబుతోంది. తాజాగా రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు క్లీన్ చీట్ ఇవ్వడం పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ రివ్యూ పిటషన్ దాఖలు చేశారు.

రాఫెల్ ఒప్పందం విషయంలో కేంద్రం న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తోందని తెలిపారు. తప్పుడు వివరాలను న్యాయస్థానికి సమర్పించిందని రివ్యూ పిటషన్ లో వారు పేర్కొన్నారు. రాఫెల్ ఒప్పందంలో ముమ్మాటికి అవకతవకలు జరిగాయని, కోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరుగాలని కోరారు.

దీనిపై విచారణ చేపట్టని సుప్రీంకోర్టు రాఫెల్ ఒప్పందం నిర్ణయ ప్రక్రియను సందేహించడానికి కారణలు కనిపించడంలేదని, నాణ్యతపై అనుమానాలు లేవని, ఒప్పందం రద్దు చేయాల్సిన కారణలు కన్పించడంలేదని తెలిపింది. ఈ మేరకు ఒప్పందంపై సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కోర్టు గతేడాది డిసెంబర్ 14న కొట్టివేసింది. అయితే ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.

సుప్రీం తీర్పును బీజేపీ స్వాగతించగా కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. రాఫెల్ వివాదంలో బీజేపీ తప్పుడు నివేదికలను కోర్టు సమర్పించడం వల్లనే బీజేపీ అనుకూలంగా తీర్పు వచ్చిందని పేర్కొంది. ఈ తీర్పుపై మరోమారు సమీక్షించాలని, బహిరంగ న్యాయస్థానంలో విచారణ జరపాలని అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హా తదితరులు కోర్టుకు విన్నివించారు.

రాఫెల్ యుద్ధ విమానాల కోనుగోలు విషయంలో వేల కోట్లు రూపాయాలు చేతులు మారయని పిటీషనర్లు ఆరోపించారు. ప్రజాధనాన్ని ఓ కంపెనీకి ధారాదత్తం చేస్తే ఊరుకునేది లేదని వారు స్పష్టం చేశారు. రాఫెల్ విషయంలో బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేంత వరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు.




Full View
Tags:    

Similar News