కాంగ్రెస్ ప్రభుత్వం సంపాదించిన ఆస్తులను బీజేపీ సర్కార్ తెగనమ్ముతోందా...?
ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చూస్తే కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ ఈ దేశాన్ని ఏలింది. అదే సమయంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీయే అధికారంలో ఉంది. ఇక కాంగ్రెస్ ఏలుబడిలోనే దేశం అభివృద్ధి చెందింది అని చెప్పవచ్చు. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదు. బ్రిటిషర్లు ఈ దేశాన్ని వీడిపోయాక గుండు సూది కూడా తయారు చేసుకోలేని ఈ దేశం తరువాత కాలంలో భారీ పరిశ్రమలతో తన సత్తా చాటింది.
అలాగే నాడు 35 కోట్ల మందికే ఆహార కొరత ఉన్న దుర్బర పరిస్థితుల నుంచి 140 కోట్ల మందికి సరిపడా ఆహారాన్ని సొంతంగా ఉత్పత్తి చేసే స్తోమతకు భారత్ చేరుకుంది. తొలి ప్రధాని పండిట్ నెహ్రూ పంచ వర్ష ప్రణాళికలు ఈ దేశం దశ దిశ మార్చాయి. వ్యవసాయంతో పాటు ఈ దేశంలో పారిశ్రామికీకరణకు నాడే శ్రీకారం చుట్టడం జరిగింది. నెహ్రూ స్వయంగా ఆధునిక దేవాలయాలు పరిశ్రమలు అని చెప్పారు. అలా ఎన్నో పరిశ్రమలను ఆయన నెలకొల్పారు. అలాగే ఇందిరాగాంధీ కూడా ఆదే బాటన నడించారు.
ఆ విధంగా చూస్తే ఈ దేశ సంపద అంతా వాటి రూపంలో కళ్ళకు కట్టినట్లుగా కనిపించేది. ఒక వైపు అభివృద్ధి చేస్తూనే మరో వైపు పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను కూడా నాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు విజయవంతంగా అమలు చేసి చూపించాయి. ఇక ఈ దేశంలో అనేక పట్టణాలు కాంగ్రెస్ ఏలుబడిలోనే మహా నగరాలుగా రూపుదిద్దుకున్నాయన్నది వాస్తవరం. ఉదాహరణకు హైదరాబాద్ కి అనేక కేంద్ర పరిశ్రమలు రావడం వల్లనే ఈ స్థితిలో ఉంది అన్నది నిజం. బీహెచ్ఈఎల్, హెచ్ఎఎల్, బీడీఎల్ లతో పాటు కొన్ని వందల కంపెనీలు నాడు హైదరాబాద్ కి వచ్చాయి.
దాని వల్ల అనుబంధంగా ఎన్నో ప్రైవేట్ పరిశ్రమలు కూడా వచ్చి హైదరాబాద్ విశ్వనగరంగా ఈ రోజున నిలిచింది అని చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇపుడు బీజేపీ చేసేది ఏమిటి అన్నది కనుక చూస్తే ఊళ్ళో అప్పులు తీసుకుని ఎంజాయ్ చేస్తూ ఆ అప్పులు ఎగ్గొట్టి కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనే చెప్పాల్సి ఉంటుంది అంటున్నారు. అంతే కాదు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏళ్ల తరబడి అధికారంలో ఉంటూ కూడబెట్టిన ఆస్తులను బీజేపీ తెగనమ్ముతోంది అని కూడా విమర్శలు ఉన్నాయి.
సెంటిమెంట్ ను సైతం పక్కన పెట్టేసి విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి వాటిని కూడా అమ్మకానికి పెట్టేసి తమ చేతులు దులుపుకుంటున్నారు అని అంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల రేపటి తరానికి ఈ దేశం మిగిల్చేది ఏంటి అంటే బీజేపీ వారు ఎవరైనా సమాధానం చెప్పగలరా అన్నదే ఇక్కడ చర్చ. ఈ దేశంలో బీజేపీ ఇప్పటికి పలు మార్లు గెలిచింది 2024 వరకూ ఆ పార్టీ అధికారంలో ఉంటుంది అనుకుంటే దాదాపుగా రెండు దశాబ్దాల పాటు ఏలిన పార్టీగా చూడాలి.
మరి కాంగ్రెస్ ని విమర్శిస్తూ ఆడిపోసుకునే బీజేపీ తన హయాంలో స్థాపించిన పరిశ్రమలు ఏంటి, పెట్టిన కంపెనీలు ఏంటి అని లెక్కలు తీసి చెప్పగలదా అని అంతా అంటున్నారు. ఈ దేశంలో స్థిర ఆస్తులుగా ఉండాలని పరిశ్రమలను ప్రాజెక్టులను నాటి కాంగ్రెస్ పెద్దలు జాతికి అంకితం చేసి వెళ్ళిపోయారు. మరి వాటిని మరింతగా పెంచి దేశ సంపదను పదింతలు వృద్ధి చేసి ఆస్తులను పెంచాల్సిన బీజేపీ ఈ విషయంలో చేస్తున్నది ఏంటి అన్నదే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న విషయం.
బీజేపీ కాంగ్రెస్ కూడగట్టిన ఆస్తులను తెగనమ్ముతూ పైగా ఆ పార్టీని విమర్శించడమేంటి అని కూడా నెటిజన్లు అంటున్నారు. అసలు ఈ దేశ ప్రగతికి, పారిశ్రామికీకరణకు సంబంధించి బీజేపీ విజన్ ఏంటి అన్నది కూడా ఎవరికీ అర్ధం కాకుండా ఉందని అంటున్నారు. మొత్తానికి వెనకటికి ఉన్న ఒక ముతక సామెతను కూడా నెటిజన్లు ఉటకిస్తున్నారు.
బాగా కూడబెట్టి పెద్దల ఆస్తిని తరువాత వచ్చిన వారు పూర్తిగా ఎంజాయ్ చేసి ఏమీ కాకుండా లేకుండా చేసినట్లుగా ఇపుడు ఇంతటి సువిశాల భారత దేశానికి ధీమా లేకుండా ఏ మాత్రం ఆస్తులు లేకుండా బీజేపీ వారు చేయడమేనా వారి విజన్ అని కూడా నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారుట. మరి ఇకనైనా బీజేపీ ఆస్తుల తెగనమ్మడానికి ఫుల్ స్టాప్ పెడుతుందా లేక ఇదే తమ ఘనత అని చెప్పుకుంటుందా అన్నది చూడాలి. అలా చేస్తూ పోతే జనాల కఠినమైన తీర్పు కూడా అదే పార్టీ చవిచూడాల్సి ఉంటుందని అంటున్న వారూ ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.