జగన్ కి షాక్ ఇచ్చే కామెంట్స్ చేసిన చంద్రబాబు
ఏపీకి నాలుగవ సారి సీఎం అయిన చంద్రబాబు 2029లో జరిగే ఎన్నికల్లో మళ్లీ గెలిచి ఐదవసారి సీఎం గా సభకు వస్తానని స్పష్టం చేశారు
ఏపీకి నాలుగవ సారి సీఎం అయిన చంద్రబాబు 2029లో జరిగే ఎన్నికల్లో మళ్లీ గెలిచి ఐదవసారి సీఎం గా సభకు వస్తానని స్పష్టం చేశారు. నిన్న గాక మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు మరో రెండు టెర్ములు సీఎం గా ఉండాలని ఆకాంక్షించారు. దానికి స్పందించినట్లుగా బాబు ఏపీ అసెంబ్లీ చివరి రోజున చేసిన కామెంట్స్ ఉన్నాయి.
తాను మళ్లీ సీఎం అవుతాను అని బాబు చెప్పారు. అంటే బాబు మరింత కాలం సీఎం గా ఉంటానని చెప్పారన్న మాట. ఈ అసెంబ్లీ కనుక పూర్తి అయితే వచ్చే ఎన్నికల్లో తాను సీఎం అవుతాను అని భావిస్తున్న వైసీపీ అధినేత జగన్ కి ఈ కామెంట్స్ షాక్ గానే చూడాలని అంటున్నారు.
జగన్ 2029లో సీఎం అవుతారు అని ఆశగా చూస్తున్న వైసీపీ వర్గాల వారికి బాబు ఇచ్చిన స్టేట్మెంట్ తో కలవరం రేగింది అనుకోవాలి. ఇదిలా ఉంటే చంద్రబాబు తాను మళ్ళీ సీఎం గా ఎందుకు అవుతాను దానికి గల కారణాలు రీజనబుల్ గా సభలో ప్రస్తావించారు.
ప్రజలకు మంచి చేసిన వారిని ఎవరూ వదులుకోరని అన్నారు ప్రజలే మళ్ళీ ఆయా పార్టీలను నాయకులను గెలిపిస్తారు అని ఆయన చెప్పారు. దేశంలో ఒకే పార్టీలు మూడు దశాబ్దాలకు పైగా పాలిస్తున్న సందర్భాలు ఉన్నాయని బాబు చెప్పడం విశేషం.
అందువల్ల ఏపీలో మంచి పాలన చేస్తున్న టీడీపీ కూటమి కూడా మరింత కాలం పాలిస్తుందని బాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో చూస్తే కనుక విపక్షం సరైనది లేదు అన్నట్లుగానే బాబు మాటలు ఉన్నాయని అంటున్నారు. కూటమిలో మూడు బలమైన పార్టీలు ఉన్నాయి.
అందువల్ల ఎపుడు ఎన్నికలు జరిగినా అంతా ఏకపక్షంగానే వస్తుందని బాబు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఇక బీజేపీ జనసేన సైతం కూటమితోనే మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు. దాంతో కూటమిగా ఎన్నికలకు వెళ్తే 2024లో వచ్చిన 60 శాతం ఓటింగ్ మళ్ళీ వస్తుందని బాబు ధీమాగా ఉందని అంటున్నారు
ఇలా రాజకీయంగా కూడా తమకు అనుకూలమైన వాతావరణం ఉందని బాబు లెక్క వేసుకుంటూ తాము మళ్ళీ గెలుస్తామని నిండు అసెంబ్లీలో ప్రకటించారు. మొత్తానికి చూస్తే ఏపీకి సంబంధించినంతవరకు సీఎం సీటు అయితే ఖాళీగా లేదు అనే చెప్పాలి.
ఇప్పట్లో లోకేష్ కూడా సీఎం కాలేరని కూడా బాబు మాటలను బట్టే అర్ధం అవుతోంది అని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎటూ బాబే మరో రెండు సార్లు సీఎం గా ఉండాలని కోరుకున్నారు కాబట్టి కూటమిలో అయితే బాబే ఎప్పటికీ సీఎం. విపక్ష వైసీపీకి అయితే వచ్చే ఎన్నికల్లో కూడా ఏ మాత్రం చాన్స్ లేదని బాబు సహా కూటమి నేతలు చెప్పేస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి బాబు ఐదవసారి సీఎం అవుతారా లేదా అన్నది.