సాదినేని యామినికి కీలక పదవి ఇచ్చిన బీజేపీ ... !

Update: 2021-02-01 12:30 GMT
ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కీలకంగా వ్యవహరించి, వైసీపీ పై , ప్రస్తుత సీఎం జగన్ పై పదునైన విమర్శలు చేసి , గతేడాది బీజేపీలో చేరిన సాదినేని యామినికి ఆ పార్టీ కీలక పదవిని అప్పగించింది. ఆమెను బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తున్నట్టు రాష్ట్ర విభాగం అధ్యక్షురాలు నిర్మలా కిశోర్ నిన్న ప్రకటించారు. ఈ మేరకు నియామక పత్రం విడుదల చేశారు. తన మీద నమ్మకంతో పదవిని అప్పగించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలకు ధన్యవాదాలు తెలిపారు. తనకు అండగా నిలిచిన నేతలు, కార్యకర్తలకు ప్రత్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

సాధినేని యామిని టీడీపీలో ఫైర్‌ బ్రాండ్‌ గా పేరు తెచ్చుకొని ,   టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అలాగే ఎన్నికల సమయంలో టీడీపీ స్టార్ క్యాంపెయినర్‌ గా కొనసాగారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి తర్వాత గతేడాది జనవరిలో బీజేపీలో చేరారు.  పార్టీలో కొన్ని అంతర్గత విభేదాలు, ఇబ్బందులు ఉన్నాయని.. కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. తాజాగా  ఆమెకు మహిళా మోర్చాలో పదవి దక్కింది. ఇప్పటికే సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రయత్నం చేస్తున్న, దేవాలయాల పై జరుగుతున్న దాడులకు నిరసనగా వైసీపీ ప్రభుత్వం పై తన నిరసన గళాన్ని వినిపిస్తున్న సాధినేని యామిని శర్మకు బిజెపి కీలక బాధ్యతను అప్పగించింది .

ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ‌లో హిందూ దేవాల‌యాల‌పై జ‌రిగిన దాడి నేప‌థ్యంలో తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేశారు సాధినేని యామిని. ఆల‌యాల‌పై దాడిని ఖండిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా క‌న్నీరు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ వీడియాలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.
Tags:    

Similar News