తమిళనాట బీజేపీ రాజకీయ ఆట

Update: 2017-04-19 06:54 GMT
అమ్మ జయలలిత ఉన్నప్పటి నుంచే తమిళనాడుపై కన్నేసిన బీజేపీ ఇప్పుడు ఆమె లేకపోవడంతో ఏ చిన్న అవకాశం దొరికినా వినియోగించుకుంటూ అక్కడ పట్టుపెంచుకోవడానికి పునాదులేయాలని తెగ ట్రై చేస్తోంది.  ఈ క్రమంలో అక్కడ రీజనల్ గా అమ్మ రేంజిలో ఎవరూ ఎదగకెుండా చేయాలని ప్లాన్ చేస్తోంది. అలా జెయింట్స్ లేకుండా ఉన్నప్పుడే అక్కడ బీజేపీకి ఎంతో కొంత చాన్సుంటుందని భావిస్తోంది. ఈ క్రమంలో సందు దొరికినప్పుడంతా అక్కడ రాజకీయ కల్లోలం సృష్టించడానికి ట్రై చేస్తోందని ఇతర పార్టీలు విమర్శిస్తున్నాయి. తాజాగా తమిళనాడులో అన్నా డీఎంకే లో మళ్లీ రేగిన వివాదాల వెనుకా బీజేపీ హస్తం ఉందని అనుమానిస్తున్నారు.
    
జయలలిత చనిపోయినపుడే తమిళనాడులో పాగావేయడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని , పావులు కదిపింది. చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్న తరుణంలో అన్నాడిఎంకెలో ఉన్న వారితోనే రాజకీయం నడుపుతూ పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని యోచన చేసింది. శశికళను ముఖ్యమంత్రి కాకుండా చేయడం, తన మనిషిగా ఉన్న పన్నీర్‌ ను ముఖ్యమంత్రిని చేయడం ద్వారా బిజెపి తన మాటనెగ్గించుకునే ప్రయత్నాలు చేసింది. అయితే పరిస్థితులు తిరగబడ్డాయి. పన్నీర్‌ విఫలమయ్యాడు. పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేశారు. ఇది బిజెపికి వూహించని దెబ్బ. శశికళను జైలుకు పంపినా పరిస్థితులు తమ చెప్పుచేతల్లోకి రాకపోయే సరికి బిజెపి ఇంకా పంతం పట్టింది. అందుకే వరుసగా వ్యూహాలు రూపొందించింది. ఇపుడు పన్నీరును మళ్లీ పావుగా వాడుకుంటోంది. శశికళ మేనల్లుడు దినకరన్‌ ను పార్టీ ఉపప్రధాన కార్యదర్శి పదవినుంచే కాకుండా పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెట్టాలనే నిర్ణయం వెనుక బిజెపి హస్తం ఉందని తమిళనాట బాహాటంగా విమర్శలు వస్తున్నాయి.
    
శశికళను రాజకీయంగా జీరో చేయడమే బీజేపీ టార్గెట్ అని తెలుస్తోంది. శశికళలో జయలలితను ప్రజలు చూడటం ఆరంభిస్తే మళ్లీ తమిళనాడుపై పట్టు చిక్కడం కష్టమేనన్నది ఆ పార్టీ భావన. శశి  వారసుడిగా దినకరన్‌ పార్టీలో బలంగా ఉంటే, మళ్లీ శశికళ తెరమీదకు వస్తుంది. అపుడు జయలలితను శశికళలో చూడటం ఆరంభిస్తారు. అందుకే శిశికళ ఆనవాళ్లు కూడా లేకుండా చేస్తే బిజెపికి పని సులువు అవుతుందనే వ్యూహాన్ని అందుకుందనిచెబుతున్నారు.  దీనిలో భాగంగానే శిశికళ కుటుంబం, ఆమెకు సంబంధించిన వారు ఎవరూ అన్నాడిఎంకెలో లేకుండా చేయాలనే వ్యూహం రూపొందించి, అమలుకు శ్రీకారంచుట్టారని... ఇది పన్నీర్ వైపు నుంచి అమలు చేయిస్తున్నారని టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News