విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై బీజేపీ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి చాలా అతితెలివి చూపించారు. విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతూ ఫ్యాక్టరీ ఎక్కడికీ వెళ్లడం లేదట. కాకపోతే యాజమాన్యం మాత్రమే మారుతుందని చావుకబురు చల్లగా చెప్పారు. ఫ్యాక్టరీ ఎక్కడికీ పోవటంలేదని, కేవలం యాజమాన్యం మాత్రమే మారుతోందని చెప్పటమే ఆమె అతితెలివికి నిదర్శనం.
దాదాపు ఏడాది కాలంగా విశాఖలో జరుగుతున్న ఆందోళనంతా ఫ్యాక్టరీని ప్రైవేటీకరించద్దనే కదా. ఫ్యాక్టరీ గాజువాక ప్రాంతం నుండి ఎక్కడికి తరలిపోదన్న విషయం పురందేశ్వరి చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు. యాజమాన్యమే కేంద్ర ప్రభుత్వం చేతుల్లో నుండి ప్రైవేటు వ్యక్తులకు వెళ్ళిపోతోంది. దీన్నే ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
మొదట్లోనేమో ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడం లేదని బుకాయించారు. తర్వాత కొద్దిరోజులు అసలు మాట్లాడనేలేదు.
ఆ తర్వాత ఫ్యాక్టరీ ఎక్కడికీ పోదని పిచ్చిమాటలు మాట్లాడుతున్నారు. అంటే ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా అడ్డుకునేంత సీన్ స్ధానిక నేతల్లో ఎవరికీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. నరేంద్ర మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చలేక, స్థానిక జనాలను కన్విన్స్ చేయలేక కమలనాథులు మధ్యలో ఇరుక్కుపోయారు.
ఈ విషయంలో ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాక చివరకు జనాలను తప్పించుకు తిరుగుతున్నారు. ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించబోతోందన్న విషయం బీజేపీ నేతలతో సహా అందరికీ తెలుసు. కాకపోతే దాన్ని అంగీకరించటానికి కమలనాదులకు ఇబ్బందయ్యింది. అందుకనే కేంద్రం నిర్ణయంపై కొద్దిరోజులు నోటికొచ్చిన డ్రామాలాడారు. చివరకు ఎక్కువ రోజులు వీళ్ళ డ్రామాలు కంటిన్యూ అవ్వలేదు.
అందుకనే ఇఫుడు కొత్తగా ఫ్యాక్టరీ ఎక్కడికీ తరలివెళ్ళదని ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రమే చేతులు మరుతోందని అతితెలివి చూపిస్తున్నది. నిజానికి ఫ్యాక్టరీ విషయం అని కాదు కానీ రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్న మోడి సర్కార్ అంటేనే జనాలంతా మండిపోతున్నారు. దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో కనబడక తప్పదని అర్ధమవుతోంది.