జేడీదే తప్పు.. పవన్ సినిమాలు చేయాలి: అంబికా

Update: 2020-01-31 06:32 GMT
సీబీఐ మాజీ జేడీ, జనసేన నాయకుడు లక్ష్మీనారాయణ తాజాగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ ఆ పార్టీ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. పోతూ పోతూ పవన్ లో నిలకడ లేదని.. మళ్లీ సినిమాలు చేస్తున్నాడని.. అందుకే రాజీనామా చేస్తున్నట్టు లక్ష్మీనారాయణ కొన్ని రాళ్లు పవన్ పై వేసి పోయారు.

జేడీ రాజీనామాపై ఇప్పటికే టీడీపీ స్పందించి పవన్ కే బాసటగా నిలిచింది. తాజాగా ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ కూడా ఈ వివాదంపై స్పందించారు. జేడీ లక్ష్మీనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మద్దతు పవన్ కళ్యాణ్ కేనని ప్రకటించారు.‘ఎవరు ఏ వృత్తిలో ఉంటే వారు దాన్ని వ్యాపారంగా చేసుకుంటారు. వృత్తిని మానేసి రాజకీయాల్లోకి రావాలని ఎక్కడా ఎవ్వరూ చెప్పలేదు. పవన్ కెరీర్ సినిమాలతోనే మొదలైంది. ఆయన మొదట నటుడు. సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేసుకుంటే తప్పేంటి? జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేయాలనుకోవడం ఆయన ఇష్టం.. రాజీనామా చేయడానికి పవన్ సినిమాల్లో నటించడం అంటే నేను ఒప్పుకోను.. పవన్ కు పూర్తి సపోర్టు ఇస్తున్నాను’’ అంటూ అబింకా కృష్ణ సైతం తాజాగా జేడీ రాజీనామాను తప్పుపట్టారు.

ఆనాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా కొన సాగుతూనే సినిమాలు చేయలేదా అని అంబికా కృష్ణ ప్రశ్నించారు. వారి వృత్తి అది అని.. వృత్తిలో ఎదిగే జనాల ముందుకు రాగలిగారని అన్నారు. పవన్ మరిన్ని సినిమాల్లో నటించాలని నేను కోరుకుంటున్నారు.. పవన్ సినిమాల్లో నటిస్తూనే ప్రజా సేవా చేయాలని.. మేం అండగా ఉంటామని అంబికా కృష్ణ తెలిపారు.
Tags:    

Similar News