తెలంగాణలో ఇటీవల బయటపడ్డ ఓ బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడి రాసలీలలు కలకలం రేపాయి. ఓ మహిళకార్యకర్త తనను బీజేపీ జిల్లా అధ్యక్షుడు లోబరుచుకున్నాడని.. మోసం చేశాడని ఆరోపించడం సంచలనమైంది.
తాజాగా ఈ కేసులో ట్విస్ట్ నెలకొంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూ టౌన్ పోలీసులు తాజాగా బీజేపీ నేతను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. పెళ్లి పేరుతో తనను మోసం చేయడమే కాకుండా బెదిరింపులకు గురిచేస్తున్నాడని.. ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సదురు బీజేపీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం బీజేపీ నేతకు ఈనెల 23 వరకు జ్యూడీషియల్ రిమాండ్ విధించినట్టు సమాచారం..
బీజేపీ నేత తనను మోసం చేశారని ఆరోపిస్తూ ఇటీవల బాధితురాలు మాట్లాడిన కొన్ని వీడియోలు కరీంనగర్ లో కలకలం రేపాయి. తానూ ఓ బీజేపీ కార్యకర్తనే అని ఆ వీడియోలో ఆమె పేర్కొనడం గమనార్హం. బీజేపీ నేత మోసం చేశారని పోలీసులకు చెప్పినా పట్టించుకోవట్లేదని వీడియోలో ఆమె ఆరోపించారు.
బీజేపీ నేత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితోనూ బాధితురాలు మాట్లాడినట్టుగా ఓ వీడియో వెలుగుచూసింది. తనకు జరిగిన అన్యాయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి వివరించిన బాధితురాలు తనకు న్యాయం చేయాలని కోరినట్టు తెలిసింది. ఈక్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సదురు నేతను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.