కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులని వెనక్కి తీసుకోవాలని గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని నగరాన్ని చుట్టుముట్టిన రైతులు శాంతియుతంగానే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అలాగే రోజులు గడిచే కొద్దీ తమ ఆందోళనను ఉదృతం చేస్తున్నారు. ఇక, రైతు ఉద్యమంలో భాగంగా నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ప్రస్తుతం బంద్ కొనసాగుతుంది. మరోవైపు అన్ని రంగాలవారు రైతుల పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు.
ఇదిలా ఉంటే ..గతంలో కేంద్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్న ప్రముఖులు రైతుల పోరాటానికి సంఘీభావంగా తమ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నారు. అయితే, వారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మధ్యప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి, బీజేపీ నేత కమల్ పటేల్. రైతులకు మద్దతుగా తమ అవార్డులను వెనక్కి ఇచ్చేవారు నిజమైన దేశ భక్తులు కాదని అయన అన్నారు. వారికి అవార్డులు ఎలా వచ్చాయో తెలుసా అని ప్రశ్నించారు. భారత మాతపై నిందలు వేసేవారికి, దేశాన్ని ముక్కలు చేయాలన్న వారికి గతంలో అవార్డులు వచ్చాయంటూ సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ నేత, అలాంటి అవార్డు గ్రహితలు, మేధావులు ప్రస్తుతం వాటిని వెనక్కి ఇస్తున్నారని, వారు నిజమైన దేశ భక్తులు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతుగా కొందరు ప్రముఖులు తమ అవార్డును వెనక్కి ఇవ్వడంపై మధ్యప్రదేశ్ వ్యవసాయ మంత్రి, బీజేపీ నేత కమల్ పటేల్ ఈ మేరకు సోమవారం స్పందించారు.