కదులుతున్న బస్సులో ప్రయాణికుల మధ్య ఓ మహిళను ముద్దాడాడో బీజేపీ నేత. ఆయన ఘనకార్యమంతా కెమెరాలో రికార్డవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనతో మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది.
ముంబైకి చెందిన బీజేపీ నేత రవీంద్ర బవన్థాడే కదులుతున్న బస్సులో మహిళకు ముద్దు పెడుతూ బస్సులోని సీసీటీవీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. ఆమెను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సమయంలో ఇతర ప్రయాణికులు కూడా బస్సులో ఉన్నారనే సంగతి కూడా సదరు నేత మరచిపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆ బీజేపీ నేతపై బాధిత మహిళ రేప్ కేసు పెట్టింది.
కేసు పెట్టినప్పటి నుంచి ఆ నేత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే, ఈ మొత్తం కథలో ఓ ట్టిస్టు ఉంది. రవీంద్రకు, ఆ మహిళతో ఇంతకు ముందే పరిచయం ఉంది. తనకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని, పెళ్లి కూడా చేసుకుంటానని మాయ మాటలు చెప్పాడని సదరు మహిళ తెలిపింది. అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు కనుక ఈ ఘటనపై పోలీసులు కిక్కురు మనడం లేదు. బీజేపీ నాయకులు కూడా ఈ ఘటనపై స్పందించేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు.
Full View