తెలంగాణ బీజేపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. 6ఏళ్ల తర్వాత నూతన అధ్యక్షున్ని హైకమాండ్ నియమించడంతో.. పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పాత కమిటీల స్థానంలో కొత్తవి రాబోతున్నాయన్న ప్రచారం జోరుగా జరుగుతున్న నేపథ్యంలో జిల్లాల నుంచి పార్టీ కార్యాలయానికి వచ్చే నాయకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నూతన కమిటి నియమకానికి ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆధారంగా పూర్తి స్థాయి కమిటీలో తన సొంత టీం ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
గతనెల 22 న పార్టీ చీఫ్ గా అధికారంగా పదవి బాధ్యతలను స్వీకరించిన కె.లక్ష్మణ్ తన టీంలో ఎవరు ఉండాలనే దానిపై కసరత్తు మొదలుపెట్టారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీలో 10 మంది ఉపాధ్యక్షులు - నలుగురు ప్రధాన కార్యదర్శులు - 10మంది కార్యదర్శులు - ఆరు నుంచి 8మంది అధికార ప్రతినిధులు 70 నుంచి 80 మంది కార్యవర్గ సభ్యులు - వీరితోపాటు ప్రత్యేక అహ్వానితులు ఉంటారు. దీనికి అదనంగా యువజన మోర్చా తో పాటు, బీసీ - ఎస్సీ- గిరిజన - మైనారిటీ మోర్చాలతో కలిపితే మొత్తం 250 మందికి రాష్ట్ర కార్యవర్గంలో చోటు ఉంటుంది. మరో రెండూ మూడు వారాల్లోగా తన టీం జాబితాను ఫైనల్ చేసేలా రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వడపోత కార్యక్రమం చేపట్టిన ఆయన కొత్త కమిటీని త్వరలో ప్రకటిస్తానని సమాచారం.
ఇదిలా ఉండగా సొంత టీంలో కొత్త వారికి ఎక్కువ అవకాశమివ్వడానికి లక్ష్మణ్ కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా యువత.. మహిళలకు చోటు కల్పించాలని భావిస్తున్నారు. అలాగే పాత కమిటీలోని కొందరిని తీసుకోవాలని భావిస్తున్నారు. పాత కొత్త కలయికతోనే కొత్త కమిటీ వేయాల్సిన పరిస్థితి పార్టీలో ఉంది. అయితే అందరిని కాదని కొత్తవారిలో ఎవరికి లక్ష్మణ్ అవకాశమిస్తారన్న దానిపై పార్టీలో చర్చ సాగుతోంది.