వైరల్... దళపతి విజయ తో కలిసి త్రిష రాజకీయాభ్యాసం!?
దక్షిణ చలనచిత్ర పరిశ్రమలో నటి త్రిష పేరు మీద సృష్టించబడిన సంచలనాల లెక్కే వేరు అని అంటారు.
తాజాగా కోలీవుడ్ కేంద్రంగా ఓ షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అది కాస్తా.. సౌత్ సినిమా ఇండస్ట్రీల్లో సంచలనాల విషయంలో తనను ఎవరు కొట్టేవారులేరు అన్నట్లుగా ముందుకు దూసుకుపోతుంది అనే పేరు సంపాదించుకుంది అని చెప్పే నటి త్రిష కృష్ణన్ కి సంబంధించిన విషయం కావడంతో.. డబుల్ వైరల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
అవును... దక్షిణ చలనచిత్ర పరిశ్రమలో నటి త్రిష పేరు మీద సృష్టించబడిన సంచలనాల లెక్కే వేరు అని అంటారు. అది ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా ఆమెకు ఆమే సాటి అని చెబుతుంటారు. 41 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోయిన్స్ తో పోటీ పడుతూ దూసుకుపోతోంది త్రిష. ఈ సమయంలో ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.
ఇందులో భాగంగా... తనకు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశ ఉందని త్రిష సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. మరోపక్క ఇటీవల పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్ తో త్రిష చాలా సన్నిహితంగా ఉంటుందనే చర్చా నెట్టింట జరుగుతుంటుంది. అయితే... మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని ఆమె క్లారిటీ ఇస్తుంటారు.
ఈ సమయంలో త్రిష త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే విషయం ఇప్పుడు కోలీవుడ్ లో ప్రచారంలోకి వచ్చింది. ఇందులో భాగంగా... దళపతి విజయ్ 'తమిళగ వెట్రి కళగం' పార్టీ నుంచే ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని.. అన్నీ అనుకూలంగా జరిగితే 2026 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఓ ప్రచారం హల్ చల్ చేస్తోంది.
ఈ సమయంలో ఆమెకు దళపతి విజయ్ నుంచి అన్ని రకాలుగా మద్దతు ఉంటుందని, ప్రోత్సాహం లభిస్తుందని అంటున్నారు. అయితే... ఇప్పటికే అగ్రకథాయకిగా బిజీగా ఉన్న త్రిష కూడా.. తనకు మంచి స్నేహితుడు అని చెప్పుకునే విజయ్ లాగానే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని.. అతని అడుగుజాడల్లో నడవబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది.
మరి.. ఈ ప్రచారంపై త్రిష స్పందిస్తారా..? లేక, మౌనమే సమాధానం అని చెబుతారా..? అదీగాక, శతకోటి ప్రచారాల్లో ఇదొకటి అని లైట్ తీసుకుంటారా..? అనేది వేచి చూడాలి!