'ఫైన్ కడతా..' రూల్స్ పాటించేది లేదన్న బీజేపీ నేత!

Update: 2019-11-04 12:20 GMT
ఫైన్ కట్టడానికి అయినా రెడీ అని, తను ప్రభుత్వం పెట్టిన రూల్స్ ను మాత్రం పాటించేది లేదని మీడియా ముందే ప్రకటించారు బీజేపీ నేత విజయ్ గోయల్. ఢిల్లీ లో భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతల్లో విజయ్ గోయల్ ఒకరు. అక్కడ రాజకీయంగా ఆమ్ ఆద్మీ పార్టీకి, బీజేపీకి ఏ రేంజ్ లో ఫైట్ సాగుతూ ఉందో తెలిసిన సంగతే.

ఇలాంటి నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ సర్కారు మళ్లీ అమలు చేస్తున్న 'ఆడ్- ఈవెన్ ఫార్ములా' ను బీజేపీ వ్యతిరేకిస్తూ ఉంది. ఢిల్లీ మహానగరంలో శీతాకాలంలో కాలుష్యం ప్రమాదకరమైన స్థాయికి చేరుతూ ఉంటుంది.ఈ క్రమంలో ఈ ఏడాదీ అదే పరిస్థితి నెలకొంది.

దీంతో వాహనాలను నియంత్రించి కాలుష్యాన్ని నివారించేందుకు కేజ్రీవాల్ తన వంతు ప్రయత్నాలను మళ్లీ మొదలుపెట్టింది. అందులో భాగంగా 'సరి-బేసి' ఫార్ములాను అమల్లో పెడుతూ ఉంది.
కార్ల నంబర్లను ప్రాతిపదికగా తీసుకుని సరిసంఖ్య నంబర్ల కార్లు ఒక రోజు, బేసి సంఖ్య నంబర్ల కార్లను మరో రోజు రోడ్ల మీదకు వదులుతున్నారు. దీని వల్ల వాహన కాలుష్యం ఎంతో కొంత తగ్గుతుందనేది ప్రభుత్వం ఆలోచన.అయితే దీన్ని అక్కడి ప్రతిపక్ష పార్టీల్లో ఒకటైన కమలం పార్టీ వాళ్లు గౌరవించడం లేదు.

స్వయంగా ఆ పార్టీ నేతల విజయ్ గోయల్ ఈ విషయంలో ఘాటుగా స్పందించాడు. ప్రభుత్వం చెప్పినట్టుగా వినేది లేదంటూ ఆయన సోమవారం నాటి నిబంధనలకు విరుద్ధంగా తన కారును బయటకు తీశారు. తనే  నడిపారు. 'సరి-బేసి' నియమాన్ని పాటించేది లేదని, తనను ఎవరైనా ఆపితే ఫైన్ అయిన కట్టేదే కానీ, ప్రభుత్వ నిబంధలను మాత్రం ఖాతరు చేసేది లేదని విజయ్ గోయల్ చెప్పుకొచ్చారు.

అయినా కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటే, తాము దానికి కూడా సహకరించేది లేదంటూ బీజేపీ వాళ్లు తమ తీరును చాటుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇలాంటి నియమాన్నే మోడీ సర్కారు తీసుకొచ్చి ఉంటే, బీజేపీ వాళ్లు ఆహా..ఓహో.. అనే వాళ్లు కారా
Tags:    

Similar News