బీజేపీలో రేగిన రాజ‌ధాని సెగ‌లు..!

Update: 2019-08-31 12:00 GMT
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డి విసిరిన రాజ‌ధాని పాచిక పారింది.. అధికార వైసీపీని ఇరుకున పెట్టాల‌ని బీజేపీ వేసిన ఎత్తుగ‌డ ఇప్పుడు విక‌టించి బీజేపీని నిలువునా చీల్చ‌బోతుంది. ఏపీ బీజేపీలో రాజుకున్న ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి చిచ్చు వ‌ర్గ విభేదాల‌కు దారి తీసింది. ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా ల‌క్ష్మీనారాయ‌ణ వ్య‌వ‌హ‌రంపై విసిగిన రాష్ట్ర బీజేపీ నేత‌లు ఢిల్లీ బాట ప‌ట్టారు. ఏపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ టీడీపీ ట్రాప్‌ లో చిక్కుకుని అధికార వైసీపీని ఇరుకున పెట్టెలా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో ఏపీ రాష్ట్ర‌ నేత‌లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

ఇంత‌కు ఏపీలో బీజేపీలో రెండు గ్రూపులుగా మార‌డానికి కార‌ణం ఏమై ఉంటుంద‌నే చ‌ర్చ క‌న్నా.. అస‌లు బీజేపీలోకి వ‌ల‌సొచ్చిన టీడీపీ నేత‌లు ఒక గ్రూపుగా - అస‌లు బీజేపీలో ఉన్న నేత‌ల‌ది మ‌రో గ్రూపుగా ఉంది. అంటే వ‌ల‌స‌ల‌తో వ‌చ్చిన‌వారు బీజేపీలో ఒక గ్రూపుగా మార‌ర‌న్న‌మాట‌. బీజేపీని ప‌టిష్టం చేసేపేరుతో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ టీడీపీ నుంచి బీజేపీలోకి వ‌ల‌సొచ్చిన నేత‌ల‌తో ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేశాడు. దీంతో బీజేపీలోని మ‌రోవ‌ర్గం నేత‌లు బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో స‌మావేశ‌మ‌య్యారు. దీంతో పోటాపోటీగా రెండు వ‌ర్గాలు ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న చందంగా పార్టీ స‌మావేశాలు జ‌రుపుకున్నారు.

రాష్ట్ర పార్టీ కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో బీజేపీ నేతలు ఐవైఆర్ క్రిష్ణారావు - మాజీ డీజీపీ దినేష్ రెడ్డి - సుధీష్ రాంబొట్ల - మాజీ ఐఏయస్ దాసరి శ్రీనివాసులు సహా మరి కొంత మంది హాజరయ్యారు. రాజధాని విషయంలో బీజేపీ అధ్య‌క్షుడు కన్నా ఏకపక్షంగా వ్యవహరించారని.. టీడీపీ ట్రాప్ లో పడుతున్నారంటూ - సుజనా చౌదరితో చర్చించి రాజధాని ప్రాంతంలో పర్యటనకు వెళ్లారని రాష్ట్ర కార్యాలయంలో సమావేశంలో పాల్గొన్న ఏపీ బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ నిర్ణయం మేరకు నడుచుకోవాల్సిన సమయంలో.. ఒకరిద్దరి నేతలతో చర్చించి వారికి వారే నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కన్నా మీద అసహనం వ్యక్తం చేసారు.

హైదరాబాద్ లో  కన్నా ల‌క్ష్మీనారాయ‌ణ త‌న నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ నుండి బీజేపీలో చేరిన సుజనా చౌదరి - సీఎం రమేష్ - టీజీ వెంకటేష్ - సోము వీర్రాజు - సత్యమూర్తి లాంటి వారు హాజరయ్యారు. ఏపీలో పార్టీ పటిష్ఠత..ప్రభుత్వ వ్యతిరేకత..పార్టీలో చేరికలు - వైసీపీ ప్ర‌భుత్వంపై పోరాటం - పోల‌వ‌రం - టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌రిగిన అవినీతి - పోలవరం రివర్స్ టెండరింగ్ తో జ‌రిగే న‌ష్టం - రాజధాని పైన ప్రభుత్వం తీరుతో  ఏపీ క‌లిగే నష్టం  పార్టీ జాతీయ నాయకత్వంతోనూ చర్చించి..స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. చ‌ర్చించిన‌ట్లు ప్ర‌చారం సాగుతుంది.

ఇలా రెండు గ్రూపులు ఎవ‌రికి వారేగా స‌మావేశం కావ‌డంతో బీజేపీలో ఆధిప‌త్య‌పోరు ప‌తాక‌స్థాయికి చేరుకుంద‌నే ఊహ‌గానాలు వినిపిస్తున్న త‌రుణంలో.. ఓ నేత కీల‌క వ్యాఖ్యాలు చేశాడు...తాము కన్నాకు వ్యతిరేకంగా సమావేశం కాలేదని.. జాతీయ నాయకత్వానికి ఏపీలో పరిస్థితులు వివరించాలని నిర్ణయించామని..దీని పైనే చర్చిస్తున్నామని చెప్ప‌డం చూస్తుంటే క‌న్నా వ్య‌వ‌హార‌శైలీపై ఢీల్లీ పెద్ద‌ల‌కు స‌మాచారం అందిచార‌నే టాక్ వినిపిస్తుంది.

అయితే క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ త‌న సొంత నివాసంలో హైద్రాబాద్‌ లో స‌మావేశం కావ‌డం - అది కేవ‌లం టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్య‌స‌భ స‌భ్యులు - మాజీ మంత్రి - కొంద‌రు నేత‌ల‌నే పిల‌వ‌డం మ‌రో వ‌ర్గానికి ఆగ్రహం తెప్పించింద‌ట‌. టీడీపీకి అనుకూలంగా ఉన్న ఈ గ్రూపుతో ఏపీలో బీజేపీ బాగుప‌డ‌టం ఎలా సాధ్య‌మ‌ని - అధికార వైసీపీతో కేంద్రంలో బీజేపీ సానుకూలంగా ఉంటే ఇక్క‌డ వ్య‌తిరేకంగా ప‌నిచేస్తే వ‌చ్చే నష్టం బీజేపీకే అని ఒక వ‌ర్గం వాదిస్తుంద‌ట‌. ఇక క‌న్నా వ‌ర్గం మాత్రం టీడీపీ పాల‌న‌లో జ‌రిగిన అవినీతిని వైసీపీ వెలికితీస్తే, పోల‌వ‌రం రివ‌ర్స్ టెండ‌రింగ్ వ‌ల్ల ఏపీకి న‌ష్టం అని చెపుతున్న‌ప్ప‌టికి అది ప‌రోక్షంగా టీడీపీ న‌ష్టం క‌నుక వైసీపీ ప్ర‌భుత్వం ముందుకు పోకుండా చూడాల‌నేది క‌న్నా వ‌ర్గం ప్లాన్‌గా ఉంద‌ట‌..

అంటే ఇక్క‌డ క‌న్నా వ‌ర్గం టీడీపీ నుంచి వ‌చ్చిన నేత‌ల ట్రాప్‌ లో చిక్కి టీడీపీ చేసిన త‌ప్పిదాల‌ను వైసీపీ వెలికితీస్తే వాటిపై విమ‌ర్శ‌లు చేస్తే బీజేపీకి లాభం క‌న్నా న‌ష్ట‌మే ఎక్కువ అని మ‌రో వ‌ర్గం వాద‌న‌. అందుకే టీడీపీని దెబ్బ‌తీసి బీజేపీ బ‌ల‌ప‌డాలంటే క‌న్నాను త‌ప్పించాల‌ని బీజేపీలో మ‌రో సీనియ‌ర్ నేత‌కు అధ్య‌క్ష ప‌ద‌వి ఇవ్వాల‌ని ఓ వ‌ర్గం వాదిస్తుంది. ఇప్పుడు టీడీపీకి అనుకూల‌మైన ఓ బ‌ల‌మైన గ్రూపు బీజేపీలో చేరి టీడీపీ అక్ర‌మాల‌ను బ‌య‌టికి రాకుండా త‌ప్పించుకునే ఎత్తు వేస్తున్నందున దాన్ని అడ్డుకోవాల‌ని మ‌రో వ‌ర్గం ఎత్తుగ‌డ‌. సో ఇప్పుడు బీజేపీ ఇంటిపోరు వ‌ర్గ‌పోరుగా మారింది.. అంటే ఈ పోరుతో ఏపీలో బీజేపీ బ‌లం పెర‌గడం క‌న్నా హీన‌మ‌య్యే ప‌రిస్థితే క‌నిపిస్తుంది. ఇప్పుడు బీజేపీ పోరు ఢిల్లీ పెద్ద‌ల‌కు చేరింద‌న్న‌మాట‌.


Tags:    

Similar News