'నమో' మాధవీలత.. బరిలోకి..

Update: 2019-03-18 07:13 GMT
నచ్చావులే.. స్నేహితుడా లాంటి చిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ మాధవీలత సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయాల బాట పట్టారు. టాలీవుడ్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈమెకు అనంతర కాలంలో అవకాశాలు రాలేదు. ఈ నేపథ్యంలో ఆమె అప్పట్లో టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు పలువురిపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు అన్నీ ముగిసిపోయిన నేపథ్యంలో రాజకీయాల వైపు అడుగులు వేశారు.

ఇప్పటికే బీజేపీలో చేరిన మాధవీలతకు తాజాగా జాక్ పాట్ చాన్స్ వచ్చింది. బీజేపీ అధిష్టానం ప్రకటించిన ఏపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో మాధవీలతకు సీటు దక్కింది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి మాధవీలతను బీజేపీ బరిలో దింపుతోంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసి మాధవీలత కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడారు.. మరోసారి కేంద్రంలో నరేంద్రమోడీ సర్కారే వస్తోందని.. అంతా నమో నామజపమే అన్నారు.

హీరోయిన్లుగా చేసి రాజకీయాల్లోకి వచ్చిన రోజా, దివ్యవాణిలు ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. ఇప్పుడు గుంటూరు వెస్ట్ నుంచి మాధవీ లత రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. మరి ఈమే ఏమేరకు ప్రభావం చూపిస్తారనేది వేచి చూడాల్సిందే..
Tags:    

Similar News