హిమాచల్ ఎఫెక్ట్: మహిళలకు బీజేపీ పెద్దపీట మేనిఫెస్టోలో వరాల జల్లు
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని బీజేపీ మహిళలపై వరాల జల్లు కురిపించింది. ఇప్పటి వరకు పట్టించుకోని మహిళా వర్గాన్ని ఇప్పడు ఎన్నికలు చేరువ అయ్యేసరికి ఏకంగానెత్తిన పెట్టుకున్నంత పనిచేసింది. మేనిఫెస్టోలో ఏకంగా మహిళలకు భారీ వరాలు గుప్పించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్, ఏటా మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, విద్యార్థినులకు సైకిళ్లు, స్కూటీలు, స్కాలర్ షిప్పులు వంటి కీలక ప్రటకనలు చేసింది.
హిమాచల్ ప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అలాగే దశలవారీగా ఎనిమిది లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించింది. పార్టీ జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా ‘సంకల్ప్ పత్ర’ను ఆవిష్కరించారు. హామీలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని ఐదు వైద్యకళాశాలల్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. వక్ఫ్ ఆస్తులపై పూర్తి స్థాయి సర్వే చేయించి చట్టవిరుద్ధ ఆక్రమణకు చెక్ పెడతామని తెలిపింది. మహిళల కోసం ప్రత్యేకంగా హామీలను ఇచ్చిన బీజేపీ.. 6-12 తరగతుల విద్యార్థినులకు సైకిళ్లు ఇస్తామని తెలిపింది. ఉన్నత విద్య అభ్యసించే వారికి స్కూటీలను అందజేస్తామని ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపింది. 68 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో నవంబరు 12న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, మరో ఏడాదిన్నరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఇదే మేనిఫెస్టో అమలు చేస్తారా? అనే చర్చ సాగుతుండడం గమనార్హం.