ప్రస్తుతం దేశంలో ఎన్నికల హడావిడి నెలకొని ఉంది. దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకి ఈసీ షెడ్డ్యూల్ విడుదల చేయడంతో దేశం మొత్తం ఎన్నికల వాతావరణం తలపిస్తుంది. పలు రాష్ట్రాల్లో బై ఎలక్షన్స్ , మున్సిపల్ ఎలక్షన్స్ , ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతుండటం మొత్తం దేశమంతా హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ వ్యూహం సిద్ధం చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా బాగా గట్టిగానే పోరాడుతుంది. ప్రస్తుతం అన్ని ప్రధాన పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ బీజేపీ పై తీవ్రమైన విమర్శలు చేశారు. బీజేపీ అంటే ట్విట్టర్ వేదికగా కొత్త అర్థం తెలియజేశారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు అని .. బర్డన్ జనతా పార్టీ అంటూ ట్విట్టర్ వేదికగా కొత్త నిర్వచనం చెబుతూ ఎద్దేవా చేశారు. బీజేపీ దోచుకున్న దానికి వ్యతిరేకంగా దేశం మొత్తం గళమెత్తాలని సూచించారు. దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకుని, బీజేపీ దోచుకున్న దానిని అందరూ ప్రశ్నించాలని, తమతో గొంతు కలపాలని, దేశం మొత్తం కదిలి రావాలని రాహుల్ దేశ ప్రజానీకానికి ఓ పిలుపునిచ్చారు. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా గళమెత్తండి అని ట్వీట్ చేశారు. ధరల పెరుగుదల అనేది ఓ శాపమని, పన్నుల కోసం దేశ ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఊబిలోకి నెట్టేస్తోందని తీవ్రంగా ఫైర్ అయ్యారు. దేశాన్ని కేంద్ర ప్రభుత్వం విధ్వంసం దిశగా తీసుకెళ్తోందని, దానికి వ్యతిరేకంగా అందరూ గళమెత్తాలని ఆయన అభ్యర్థించారు. దీంతో పాటు పెరిగిన పెట్రోధలకు సంబంధించి ఓ వీడియోను కూడా రాహుల్ పోస్ట్ చేశారు.