ఏపీ బీజేపీ నేతలకు ఈ చివాట్లు ఏం సరిపోతాయ్?

Update: 2018-07-30 04:33 GMT
దేశంలో మరే రాష్ట్రంలోనూ కనిపించని దరిద్రపుగొట్టు రాజకీయం ఆంధ్రప్రదేశ్ లోనే కనిపిస్తుంది. తమను నెత్తిన పెట్టుకునే ప్రజల గురించి ఆలోచించే నేతల కంటే.. తమ పార్టీ.. తమ రాజకీయ మైలేజీ మీదనే ఎక్కువ ఫోకస్ చేయటం కనిపిస్తుంటుంది. ఏపీ విభజన సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలకు.. తమకు అధికారాన్ని ఇచ్చిన ప్రజా ప్రయోజనాల కోసం పోరాడాల్సి ఉందన్న ఆలోచనే లేదు. ఎంతసేపటికి పార్టీ అధినేత్రికి కోపం రాకుండా ఉంటే చాలన్న భావన వారిలో కనిపించేది.

విభజన తర్వాత కాంగ్రెస్ మీద ప్రజలు కసెక్కిపోయిన వైనాన్ని గుర్తించిన కొందరు బతకనేర్చిన నేతలు చప్పున పార్టీ మారిపోయారు. అక్కడితో తమ పాపం ప్రక్షాళన అయిపోయినట్లుగా ఫీల్ కావటం కనిపించింది. తాజాగా ఏపీ బీజేపీ నేతల పరిస్థితి ఇదే తీరులో వుంది . ఏపీలో వారు అధికారంలో లేకున్నా.. కేంద్రంలో పవర్లో ఉన్న తమ అధినేతలకు ఏపీ ప్రయోజనాల గురించి మాట్లాడమంటే వణికిపోతారు. వారి అడుగులకు మడుగులు ఎత్తే కమలనాథుల తీరుపై ఆంధ్రోళ్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

తమతో పెట్టుకున్న ఏ పార్టీ.. ఏ నేతా బాగుపడిందే లేదన్న విషయాన్ని మరోసారి నిరూపించేందుకు కసిగా ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు.  ఏపీ బీజేపీ నేతల తీరుపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నా లైట్ తీసుకుంటున్న బీజేపీ నేతలపై తాజాగా టీడీపీ మహిళా నేత.. ఇటీవల కాలంతో తమను ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్న ముళ్లపూడి రేణుక ధ్వజమెత్తారు.

ఏపీ బీజేపీ నేతలు ఆంధ్రా బిడ్డలా?  లేక ఢిల్లీ తొత్తులా? అంటూ ఆమె సూటిగా ప్రశ్నిస్తున్నారు. విశాఖకు రైల్వేజోన్ వ్యవహారంపై బీజేపీకి చెందిన ఒక మంత్రి సానుకూలంగా.. మరొకరు ప్రతికూలంగా మాట్లాడుతున్నారని.. పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నట్లుగా మండిపడ్డారు. ఇప్పటికే చర్మం దళసరిగా మారిపోయిన ఏపీ బీజేపీ నేతల్ని.. సింఫుల్ గా తిట్టేస్తే వారికి తగిలే అవకాశం చాలా తక్కువ. వారు అలాంటి మాటల్ని పిచ్చ లైట్ గా తీసుకుంటారు. ఏపీ బీజేపీ నేతలకు మంట పుట్టాలంటే.. వాడే మాటలకు మరింత మసాలా దట్టించాల్సిందే. లేని పక్షంలో తమ ప్రాంత ప్రజల ప్రయోజనాల కంటే ఢిల్లీ నేతల అభిమతానికే వారు పెద్దపీట వేస్తారు.
Tags:    

Similar News