పరువు హత్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తమ కంటే తక్కువ కులం వారిని పెళ్లాడారన్న ఆగ్రహంతో హత్యలు చేయటం తెలిసిందే. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో దేశంలో అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు పలువురు పలు వివాదాల్లో కూరుకుపోతున్నారు. ఇలాంటివేళ.. తాజాగా మరో ఎమ్మెల్యే చేరారు.
తన కుమార్తె దళితుడ్ని పెళ్లాడిందన్న కోపంతో ఆ కొత్త జంట మీదా.. అబ్బాయి కుటుంబసభ్యుల మీదా.. వారి బంధువుల మీదా దాడి చేసే ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. తన తండ్రి అనుచరులు జరుపుతున్న దాడుల నుంచి తప్పించుకుంటూ పరుగులు పెడుతున్న ఆ జంట తాజాగా సోషల్ మీడియాలో తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.
ఉత్తరప్రదేశ్ లోని బిథారి చేన్ పూర్ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా. ఆయన కుమార్తె 23 ఏళ్ల సాక్షి మిశ్రా. ఎమ్మెల్యే కుమార్తె సాక్షి 29 ఏళ్ల అజితేశ్ కుమార్ ను ప్రేమించారు. ఇంట్లో వారికి ఇష్టం లేని కారణంగా కొద్ది రోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయిన సాక్షి.. ఇటీవల అజితేశ్ ను వివాహమాడారు. వారి పెళ్లి జరిగిన నాటి నుంచి వేధింపులు అంతకంతకూ ఎక్కువయ్యాయి.
తన తండ్రి దగ్గర పని చేసే గుండాలు తమను నిరంతరం వేధిస్తున్నారని.. వారిని అలాగే విడిచిపెడితే వారు తమను చంపేయటం ఖాయమని తాజాగా ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. పరిగెత్తి.. పరిగెత్తి తాము అలిసిపోయామని.. తమను వదిలేయాలని ఆమె కోరారు. తనను చంపటం ద్వారా అందరూ చిక్కుల్లో పడతారని.. జైల్లోకి వెళ్లటం ఖాయమని పేర్కొన్నారు.
ఏం జరిగినా.. తానేం చేసినా అదంతా తన ఇష్టం కారణంగానే చేశామే తప్పించి.. ఎవరి ప్రోద్బలంతో కాదని ఆమె పేర్కొన్నారు. తామిద్దరం పెళ్లి చేసుకున్న కారణంగా అజితేశ్ కుటుంబ సభ్యుల్ని.. బంధువులపైనా దాడులు చేయటం సరికాదని సాక్షి పేర్కొన్నారు. తమ పెళ్లి వెనుక ఎవరి ఒత్తిడి లేదని స్పష్టం చేసిన ఆమె..తన తండ్రి వెంట ఉండే కొంతమంది అనుచరులు తమను వెంటాడుతున్నారని.. దాడికి ప్రయత్నిస్తున్నారన్నారు.
తాము కానీ వారి చేతికి చిక్కితే కచ్ఛితంగా చంపేస్తారన్నారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరుతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన తండ్రికి ముఖ్య అనుచరుల పేర్లను ఆమెఓ చెబుతూ.. తనకు కానీ తన భర్తకు కానీ ఏదైనా జరిగితే వారే కీలకమని పేర్కొనటం గమనార్హం. తన తండ్రికి బీజేపీ ఎంపీ.. ఎమ్మెల్యేలు సహకరిస్తున్నారని.. వారు తమ సహకారాన్ని నిలిపివేయాలని కోరారు.
వీడియో సందేశానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు రియాక్ట్ అయ్యారు. వారికి తాము రక్షణ కల్పిస్తామని డీఐజీ స్పష్టం చేశారు. అయితే.. ముందుగా సదరు జంట ఎక్కడ ఉన్నారన్న సమాచారాన్ని అందివ్వాలని కోరారు. దళితుల మీద నిత్యం ప్రేమను కురిపించే యూపీ ముఖ్యమంత్రి యోగి.. ఈ ఇష్యూ మీద కాస్త దృష్టి పెట్టి.. ఆ యువ జంటకు ఏం కాకుండా చూసేలా అభయం ఇవ్వొచ్చు కదా? ప్రస్తుతం వైరల్ గా మారిన బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె వీడియో మరెన్ని ప్రకంపనాలు సృష్టిస్తుందో చూడాలి.
Full View