తెలంగాణలో గెలిచిన బీజేపీ ఏకైక ఎమ్మెల్యే, హిందుత్వవాది అయిన టీ రాజాసింగ్ శ్రీరామనవమి సందర్భంగా స్వయంగా పాడి విడుదల చేసిన పాట పై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిన్న శ్రీరామనవమి సందర్భంగా ‘హిందుస్తాన్ జిందాబాద్.. దిల్ కి అవాజ్.. హర్ దిల్ కీ ఆవాజ్’ అంటూ పాటను పాడి ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ పాటను సైనికులకు అంకితం ఇస్తున్నట్టు రాజాసింగ్ ప్రకటించారు.
అయితే ఈ పాటను రాజాసింగ్ కాపీ కొట్టారని పాకిస్తాన్ ఆర్మీ ఆధారాలతో సహా నిరూపించింది. పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ఈ మేరకు ట్వీట్ చేసి ఎండగట్టారు.
మార్చి 23న పాకిస్తాన్ డే సందర్భంగా తాము రూపొందించిన ‘పాకిస్తాన్ జిందాబాద్’ పాటను రాజాసింగ్ కాపీ కొట్టారని పేర్కొంది. ఈ పాటను సహిర్ అలా బగ్గా రాశారని.. ఈ పాటలోని పాకిస్తాన్ జిందాబాద్ స్థానంలో హిందుస్తాన్ జిందాబాద్ చేర్చి కాపీ చేశారని ఆరోపించారు. అయితే తమ పాటను కాపీ చేసినందుకు సంతోషంగా ఉందని.. కానీ పాటకు సంబంధించిన నిజాలు కూడా వెల్లడించాలి కదా అని పాక్ మేజర్ ట్వీట్ చేసి సెటైర్ వేశారు.
ఇప్పటికే ఈ పాట కాపీ అని పాకిస్తాన్ స్థానిక మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. అసలే పాకిస్తాన్ అంటేనే ఉవ్వెత్తున ఎగిసే రాజాసింగ్ ఏకంగా పాక్ పాటను కాపీ కొట్టారన్న వార్తల నేపథ్యంలో ఇరుకునపడ్డారు.