రాజధాని ముగిసిన అధ్యాయం.. అమరావతే క్యాపిటల్

Update: 2020-02-07 13:30 GMT
ప్రాంతీయ అసమానతలు, విబేధాలు అంటే ఏమిటో తెలియని నాయకులు కూడా దానిపై విమర్శలు చేసేస్తున్నారు. వికేంద్రీకరణ అంటేనే అధికారాన్ని వివిధ ప్రాంతాలకు చేరవేయడం, విస్తృత పరచడం అని అర్థం. దీన్ని అర్థం తెలియని ఓ నాయకుడు వికేంద్రీకరణ చేయడం తో ప్రాంతాల మధ్య విబేధాలు ఏర్పడుతాయని చెబుతున్నాడు. ఆయనే బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్. అమలాపురం లో గురువారం మైక్ కనిపించగానే మాట్లాడేశాడు. ఆంధ్రప్రదేశ్‌ కు అమరావతే రాజధాని అని తమ పార్టీ బీజేపీ ఎప్పుడో ప్రకటించిందని తెలిపాడు. రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతీయ విభేదాలు సృష్టించే విధానాలకు స్వస్తి పలకాలని, ఏపీ రాజధాని ముగిసిన అధ్యాయమని చెప్పిన ఏకైక పార్టీ తమదని గొప్పగా చెప్పేసుకున్నాడు. అయితే రాజధాని మార్పు విషయం పై రైతులు చేస్తున్న ఆందోళనలకు అమరావతి వెళ్లి తాము రైతులతో కలిసి దీక్ష చేశామని, తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్న గొప్ప తమకే దక్కుతుందని పేర్కొన్నాడు. అమరావతి రాజధానిగా బీజేపీ తీర్మానం చేసినట్టు టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు ఎలాంటి తీర్మానాలు చేయలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన తో ఎవరికివారు మాకు రాజధాని కావాలంటే మాకు రాజధాని కావాలని కోరుకునే పరిస్థితిని వచ్చిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి ఒక రాజధాని సరిపోతుందన్నారు.

అయితే తాము చంద్రబాబు ఊహించిన అమరావతిని మద్దతు తెలపడం లేదని కొసమెరుపుగా చెప్పారు. అవసరమైతే విశాఖపట్నం లో కొన్ని హెచ్‌వోడీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నా అభ్యంతరం లేదు కానీ అమరావతిలోనే రాజధాని కొనసాగాలని కోరారు. దీంతో పాటు శాసనమండలి రద్దు అంశంపై కూడా మాట్లాడారు. మండలిలో 2 బిల్లులను వ్యతిరేకించడం జీర్ణించుకోలేని జగన్‌ ఏకపక్ష ధోరణితో మండలిని రద్దు చేశారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ కు అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని తెలిపారు. ఏ రాష్ట్రానికి రాని విధంగా ఆంధ్రప్రదేశ్‌ కు కేంద్రం నిధులు కేటాయించిందని ఆయన భలేగా అవాస్తవాలు చెప్పేశారు. ‘ఉపాధి’ పథకం కింద రానికి అత్యధిక నిధులు కేటాయించారని, అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒక సలహా కూడా ఇచ్చాడండి.
Tags:    

Similar News