దాడి వేళ సీరియస్ నిర్ణయాన్ని చెప్పేసిన అర్వింద్

Update: 2022-01-26 05:31 GMT
తెలంగాణ రాజకీయం ఒక్కసారి వేడెక్కిపోయేలా ఎంపీ అర్వింద్ కాన్వాయ్ మీదా.. బీజేపీ కార్యకర్తల మీదా దాడి జరిగింది. తాజాగా వస్తున్న వీడియో క్లిప్పులు చూస్తే.. బీజేపీ శ్రేణులపై జరిగిన దాడిని చూసినోళ్లంతా షాక్ కు గురవుతున్నారు. ఇంత భారీగా జరిగిన దాడిపై కమలనాథులు సీరియస్ అవుతున్నారు. అంతకంతకూ బదులు తీర్చుకుంటామని మండి పడుతున్నారు. తమపై దాడి చేస్తున్నా.. పోలీసులు మాత్రం చూస్తుండిపోయారని బీజేపీ శ్రేణులు ఆరోపణలు చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. తనపై దాడి చేసిన వైనంపై ఎంపీ అర్వింద్ కీలకవ్యాఖ్యలు చేశారు. తనపై జరిగిన దాడిని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. తనపైనా.. తమ కార్యకర్తల మీద దాడి చేయించింది ఆర్మూర్ ఎమ్మెల్యే కమ్ టీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి అంటూ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తాను ఆర్మూరు నుంచి పోటీ చస్తానని స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికల్లో జీవన్ రెడ్డిపై పోటీ చేసి 50వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని సవాలు విసిరారు ఎంపీ ఆర్వింద్. జీవన్ రెడ్డిని ఓడించకపోతే నా పేరు ధర్మపురి అర్విందే కాదన్నారు. టీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కొంటానని చెప్పిన అర్వింద్.. తనపై దాడి వెనుక సర్కారు కుట్ర ఉందన్నారు. తనపై జరిగిన దాడితోఎంపీ అర్వింద్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పాలి. ఈ పరిణామం ఎలాంటి రాజకీయ పరిస్థితులకు కారణమవుతుందన్న ది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News