అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజులుగా కర్ణాటకలో రాజకీయ వాతావరణం వేడిక్కిన సంగతి తెలిసిందే. అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్....కర్ణాటకలో కమలానికి పునర్ వైభవం కల్పించాలని బీజేపీ...గెలుపు కోసం వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి. కన్నడ ప్రజలను ఆకట్టుకునేందుకు స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి 8 రోజుల పాటు ప్రచారం చేశారు. మరోవైపు, సోనియా...రాహుల్ లు కాంగ్రెస్ తరఫున ముమ్మర ప్రచారం చేశారు. అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటోన్న గాలి జనార్థన్ రెడ్డి అనుచరులకు టికెట్లు ఇవ్వడం - 23కేసులున్న యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో బీజేపీపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. మరో 48 గంటల్లో కర్ణాటకలో పోలింగ్ మొదలుకాబోతోన్న నేపథ్యంలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. మైనింగ్ కేసుకు సంబంధించి గాలి ప్రధాన అనుచరుడు బి.శ్రీరాములు....రూ.160 కోట్లకు డీల్ కుదుర్చుకున్న వీడియో ఒకటి లీక్ అవడం కర్ణాటకలో పెను ప్రకంపనలు రేపుతోంది. కొందరు వ్యక్తులతో శ్రీరాములు డీల్ కుదుర్చుకుంటున్న వీడియోను ఓ కన్నడ న్యూస్ చానల్ ఎక్స్ క్లూజివ్ గా ప్రసారం చేయడంతో కన్నడనాట పెను దుమారం రేగింది. సరిగ్గా పోలింగ్ కు 48 గంటల ముందు బయటపడ్డ ఈ వీడియో.... .బీజేపీ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టయిన తర్వాత 2010లో ఆ వివాదాస్పద ప్రాంతంలో మైనింగ్ ఆగిపోయింది. అయితే, అక్కడ మైనింగ్ కు అనుమతినిచ్చేందుకు గానూ రూ. 160 కోట్లు లంచం ఇచ్చేలా బి.శ్రీరాములు కొందరితో చీకటి ఒప్పందం కుదుర్చుకుంటున్న ఓ వీడియో ఇపుడు బయటపడింది. ఆ వీడియోలో మాటలు స్పష్టంగా ఉండటంతో ఆ డీల్ నిజమేనని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు జస్టిస్ అల్లుడితో ఆ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఆ డీల్ జరిగిన తేదీ తర్వాత తర్వాత మైనింగ్ కు సుప్రీం అనుమతినివ్వడం ఆ వాదనలకు బలం చేకూరుస్తుంది. అయితే, 2010లోనే ఈ తీర్పుపై పెనుదుమారం రేగినా....భారత న్యాయవ్యవస్థపై గౌరవంతో ఆ అనుమానాలు బలపరచలేదు.
గతంలో, గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం.. హైదరాబాద్ లోని సీబీఐ న్యాయమూర్తికి కూడా లంచం ఇవ్వబోయిన కేసు పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ కేసులోకూడా శ్రీరాములు పేరు ఉండడం విశేషం. అదేకేసులో ఉన్న గాలి సోదరుడు సోమశేఖర్ రెడ్డి..ప్రస్తుతం బెయిల్ పై వచ్చి బళ్లారి నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు, కర్ణాటక, తమిళనాడు, గోవా రాష్ట్రాల సీబీఐ అధికారులు....గాలి కేసులో ఆధారాలు లేవని కేసు క్లోజ్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సీబీఐ అధికారులు దాఖలు చేసిన కేసుపైనే విచారణ సాగుతోంది. త్వరలోనే సీబీఐతో గాలి జనార్దన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇప్పించేందుకు బీజేపీ యత్నిస్తోందని టాక్. అంతేకాకుండా, కర్ణాటక ఎన్నికల్లో `గాలి`అనుచరులు గెలిస్తే...శ్రీరాములును డిప్యూటీ సీఎం చేస్తామని మోదీ, అమిత్ షా మాటిచ్చారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల్లో ....బీజేపీకి వ్యతిరేకత రావచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా విడుదలైన వీడియో ....బీజేపీ ఓటమికి కారణభూతమవుతుందని భావిస్తున్నారు.
వీడియో చూడటానికి క్లిక్ చేయండి
Full View