ఫుల్ మెజారిటీ ఉండడంతో దేశంలో మోడీ సర్కార్ చేసే చట్టాలకు, తీసుకునే నిర్ణయాలకు అడ్డు చెప్పే వారే లేకుండా పోతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల ఉద్యమం ఎన్ని రోజులు సాగిందో అర్థం చేసుకోవచ్చు. అయినా దీనిపై కేంద్రప్రభుత్వం స్పందించలేదు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. ఇప్పటికీ రైతుల ఆందోళన మరో రూపంలో కొనసాగుతోంది.
తాజాగా రైతుల ఉద్యమానికి బీజేపీకే చెందిన ఎంపీ మద్దతు ఇచ్చి మోడీ సర్కార్ కు గట్టి షాక్ ఇచ్చారు. సొంత ప్రభుత్వానికి ఆయన హితవు పలకడం సంచలనమైంది. మూడు సాగు చట్టాలను రద్దు చేసి..కనీస మద్దతు ధర కోసం చట్టం తీసుకురావాలని రైతు సంఘాలు కొన్ని నెలలుగా ఢిల్లీ కేంద్రంగా ఆందోళనలు చేస్తున్నాయి. సుప్రీంకోర్టు సూచించినా చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చిచెప్పింది. మరోవైపు చట్టాలను ర్దు చేసే వరకూ తమ ఉద్యమం ఆగదని రైతులు భీష్మించారు.
ఈ నేపథ్యంలోనే రైతులకు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మద్దతు ప్రకటించారు.ఇది ప్రతిపక్షాలకు గట్టి ఆయుధం ఇచ్చినట్టైంది. రైతులకు మద్దతు తెలిపుతూ వరుణ్ గాంధీ ట్వీట్ చేశాడు. ‘లక్షలాది మంది రైతులు ముజఫర్ నగర్ లో నిరసనలకు ఇవాళ సమావేశమయ్యారు. రైతులు మన సొంత మనుషులు, గౌరవప్రదంగా వారితో తిరిగి సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది. వారి బాధను అర్థం చేసుకోండి. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని వారితో కలిసి ఒక పరిష్కారానికి కృషి చేయాలి’ అని వరుణ్ గాంధీ ట్వీట్ చేశాడు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ మనవడే వరుణ్ గాంధీ. సంజయ్ గాంధీ కుమారుడు. ఫిలిబిత్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచాడు. వరుణ్ తల్లి మేనకాగాంధీ కూడా ఎంపీనే. యూపీలోని సుల్తాన్ పూర్ నుంచి ఎంపీగా ఉన్నారు. ఇక రైతుల ఉద్యమానికి మద్దతు పలికిన వరుణ్ గాంధీపై బీజేపీ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టు సమాచారం.