ప్రజా జీవితంలో ఉన్నవారు పబ్లిక్ గా ఇంకా చెప్పాలంటే ప్రైవేటుగా కూడా ఆచితూచి వ్యవహరించాలి. నాయకులు నోరుతూలితే, అందులోనూ మహిళలకు సంబంధించిన విషయంలో సంయమనం పాటించకపోతే చాలా సమస్యలు వస్తాయి. అలాంటి ఇరకాటంలోనే ఇప్పుడు బీజేపీ సీనియర్ నేత - ఎంపీ రూపాగంగూలి పడిపోయారు. గత కొద్దికాలంగా పశ్చిమబెంగాల్ లో తీవ్రమైన హింస చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంపై రూపా గంగూలి మీడియాతో మాట్లాడుతూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీని సమర్థించే వారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెచ్చుకునేవారు తమ ఇంట్లోని ఆడవాళ్లను పశ్చిమబెంగాల్ పంపించాలని రూపా గంగూలి వ్యాఖ్యానించారు. అలా వెళ్లిన వారి అమ్మాయిలు, కోడల్లు, భార్యలు ఆత్యాచారానికి గురి కాకుండా తిరిగి రాలేరు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ బెంగాల్‌కు వెళ్లిన వారు ఎలాంటి హానీ జరగకపోతే అది గొప్ప విషయం అవుతుందని ఎద్దేవా చేశారు. నిజంగా వారికి ఏ హానీ జరగకుండా ఉంటే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుంటానని బీజేపీ ఎంపీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పశ్చిమబెంగాల్‌లోని ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ మండిపడ్డారు. ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, మత కల్లోలాల నేపథ్యంలో మమత సర్కారు ఇరకాటంలో పడిందని రూపా గంగూలి తెలిపారు.
ఇదిలాఉండగా...పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు గిరిజన మహిళలపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ ఉత్తర దినాజ్‌పూర్ ఆదివాసి సమన్నాయ్ కమిటీ కార్యకర్తలు రాయ్‌గంజ్‌లో ఆందోళన నిర్వహించారు. ఆస్తులను ధ్వంసం చేసి, తగులబెట్టారు.