వ్యూహాలే రాజకీయాల్లో విజయాలను అందిస్తాయి. అలా కనుక చూసుకుంటే ఒకపుడు కాంగ్రెస్ ఈ విషయంలో టాప్ లో ఉండేది. వర్తమానంలో మాత్రం బీజేపీదే అగ్ర తాంబూలం. అందునా మోడీ అమిత్ షా కాంబోలో బోలెడంటే బోలెడు స్ట్రాటజీలు అలా పుట్టుకువచ్చేస్తాయి. గంగలో మునిగినా వారణాసిలో శివుడి కొరకు జపం చేసినా అయోధ్యలో రాముడి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినా అన్నీ భక్తిరసాన్నే కాదు నీరసంగా ఉన్న బీజేపీ కమలానికి శతకోటి కాంతులు తెచ్చేవే.
రామ జన్మభూమి పేరిట బీజేపీ మూడు దశాబ్దాల క్రితం చేసిన ఆధ్యాత్మిక ఉద్యమం రెండు సీట్లున్న పార్టీని మూడు సార్లు కేంద్రంలో కూర్చోబెట్టింది. దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో కూడా పలుమార్లు అధికారానికి తెచ్చింది. మొత్తానికి అయోధ్య రాముడికి గుడి కట్టించేస్తున్నారు. ఆయనకు ఇపుడు బీజేపీతో పాటు అందరూ భక్తులే అయిపోయారు.
కానీ బీజేపీకి అలా కాదే, ఎన్నో కలలు, ఎన్నో ఎన్నికలు ఉన్నాయి కదా. అర్జంటుగా యూపీ ఎన్నికల గండం ఎటూ పొంచి ఉంది కదా. అందుకే అదే యూపీలో ఇపుడు హే క్రిష్ణా అంటోంది కమలదళం. మధురలో శ్రీకిష్ణ జన్మస్థానాన్ని నిర్మిస్తామని అంటోంది. ఇక్కడ కూడా శ్రీక్రిష్ణ జన్మస్థాన్ లో వందల ఏళ్ల క్రితం పరాయి పాలకుల హయాంలో దాడులు జరిగాయి. ఆలయం దెబ్బ తింది.
ఇక చివరిగా ఔరంగజేబ్ చక్రవర్తి హయాంలో అంటే 1670 ప్రాంతంలో దాడులు జరిగాయి అని చరిత్ర చెబుతోంది. మధురలో ఎవరు ఉంటారు అంటే శ్రీక్రిష్ణుడు అని మన పురాణాలు చెబుతున్నాయి. హిందూ భక్తులు ఆస్తిక జనులూ ఈ రోజుకీ అదే నమ్ముతారు. కానీ మధురలో క్రిష్ణ జన్మస్థాన్ లో ఈద్గా మసీదు ఉంది. దీని మీద కోర్టులో కేసు నడుస్తోందిపుడు.
దాంతో హే క్రిష్ణా ముకుందా అంటూ కమలనాధులు ఇక్కడ ట్రంప్ కార్డు ని తీస్తున్నారుట. యూపీలో కుల రాజకీయం పీక్స్ కి చేరింది. ఎస్పీకి యాదవులు, మైనారిటీలు మద్దతుగా ఉంటే మాయావతి బీఎస్పీకి దళితులు ఓటు బ్యాంక్ గా ఉన్నారు. ఓబీసీలలో ప్రతీ కులానికి ఒక పార్టీ ఉందిక్కడ. దాంతో కులాల వారీగా ఓట్లు చీలితే బీజేపీకి బహు కష్టం. అందుకే అర్జంటుగా క్రిష్ణుడినే ఆదుకోమంటోంది.
ఎన్ని కులాలు ఉన్నా కూడా సముద్రం లాంటి హిందూ మతంలో కలియక తప్పదు. అందుకే క్రిష్ణుడిని ముందు పెట్టి బీజేపీ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టనుంది అంటున్నారు. ఈసారి క్రిష్ణ జన్మస్థాన్ లో అద్భుతమైన ఆలయం నిర్మిస్తాము అన్నది బీజేపీ హామీగా ఉందిట. మొత్తానికి క్రిష్ణ భగవానుడు సారధిగా ఉంటే యూపీ ఎన్నికల కురుక్షేత్రమే కాదు, 2024లో జాతీయ ఎన్నికలను సునాయాసంగా నెగ్గేసి కమలం శతపత్రదళంగా వికసించడం ఖాయమని కాషాయ వ్యూహం నమ్మకంగా చెబుతోంది. మరి బీజేపీ వ్యూహాలు పారితే ప్రత్యర్ధులు చిత్తు అయి కషాయం తాగాల్సిందేనా అంటే వెయిట్ అండ్ సీ అనాలేమో.