కాంగ్రెసోళ్లు అదే చేశారు. కానీ బీజేపీవోల్లు తొలి ఐదేళ్లు ఆచితూచి చూశారు. రెండోసారి అఖండ మెజార్టీ బీజేపీనీ జూలు విదిల్చేలా చేసింది. కేబినెట్ లోకి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వచ్చాక అసలు దూకుడు మొదలైంది. కశ్మీర్ ను విడగొట్టి భారత్ లో పూర్తిగా కలిపేశారు. ఎన్నో కొత్త చట్టాలు తెచ్చి భారత్ లో సంస్కరణల బాట పట్టారు. తొలి ఐదేళ్ల పాలనకు.. రెండోసారి పాలనకు శాందార్ తేడా చూపిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెసోళ్ల కక్ష సాధింపులను వంటబట్టించుకున్నారు. తమను ఇబ్బందుల పాలు చేసిన కాంగ్రెస్ నేతలను ఒక్కరొక్కరిగా జైలుకు పంపిస్తున్నారు మోడీషాలు...
ఇప్పటికే అమిత్ షాను అప్పట్లో జైల్లో పెట్టించాడనే ఆరోపణలు ఎదుర్కొన్న చిదంబరంను తీహార్ జైలుకు పంపారు. ఇక కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిన కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ను జైలుకు పంపారు. మరి నెక్ట్స్ ఎవరు? బీజేపీ టార్గెట్ ఎవరంటే ఖచ్చితంగా సోనియాగాంధీ అల్లుడు రాబార్ట్ వాద్రా అంటూ ఢిల్లీ నుంచి లీక్స్ అప్పుడే మొదలయ్యాయి.
సోనియాగాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబార్ట్ వాద్రాపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. యూపీఏ హయాంలో హర్యానాలో భూదందా సహా భారీగా చోటుచేసుకున్న కుంభకోణాల్లో ఆయన పేరు వచ్చింది. బీజేపీ ఆరోపించింది కూడా. ఆ కేసులు కొనసాగుతున్నాయి. అయితే గడిచిన ఐదేళ్లలో రాజ్యసభలో బలం లేని బీజేపీ.. కాంగ్రెస్ నేతల జోలికి పోలేదు.కానీ ఇప్పుడు కాంగ్రెస్ కుదేలై బీజేపీ అధికారం సుస్థిరం కావడం.. రాజ్యసభలోనూ బలం పెరగడంతో కొరఢా ఝలిపిస్తోంది.
త్వరలోనే సోనియాగాంధీ అల్లుడు రాబార్ట్ వాద్రా అరెస్ట్ ఖాయమంటున్నాయి బీజేపీ వర్గాలు. యూపీఏ హయాంలో కాంగ్రెస్ ను ఎదురించిన జగన్ సహా ఎంతో మందిపై కేసులు పెట్టి జైలుకు పంపిన చరిత్ర సోనియాగాంధీ సొంతం. ఇప్పుడు సోనియా బాటలోనే బీజేపీ నడుస్తోంది.ప్రతీకార రాజకీయాలకు సై అంటోంది. దీంతో సోనియా సొంత అల్లుడే జైలుకు పోయే పరిస్థితి ఏర్పడబోతోందట.. సోనియా చేసుకున్న స్వయంకృతాపరాధం దీనికి కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. సోనియా బాటలోనే బీజేపీ పెద్దలు నడుస్తుండడం.. కాంగ్రెస్ నేతలను జైలుకు పంపుతుండడం రాజకీయంగా కాంగ్రెస్ ను డిఫెన్స్ లో పడేస్తోంది.