‘పుష్ప’ సినిమా తర్వాత పెద్దగా సినిమాలు ఒప్పుకోని దేవీ శ్రీ ప్రసాద్ ఈ ఖాళీటైంలో చేసిన ఒక ప్రైవేటు ఆల్బమ్ పాట వివాదాస్పదమైంది. ఏదో అనుకొని హిందీలో ఇరక్కొడుదామని చేసిన దేవీశ్రీకి ఇప్పుడు కేసులు మెడకు చుట్టుకున్నాయి. అసలే హిందుత్వంపై గట్టిగా పోరాడుతున్న బీజేపీకి ఇప్పుడు దేవీ శ్రీ దొరికిపోయారు. దీంతో అతడికి బీజేపీ నుంచి హెచ్చరికలు వచ్చి పడ్డాయి.
హిందీలో దేవీశ్రీ ప్రసాద్ తాజాగా ‘ఓ పోరి’ అనే పాప్ ఆల్బమ్ ను పాడి విడుదల చేశారు. విదేశీ మోడల్స్ తో కలిసి దేవీ శ్రీ ఈ పాటలో తెగ హంగామా చేస్తూ ఆల్బమ్ రూపొందించారు. అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్ లాంటి దేశాల్లో చిత్రీకరించిన ఈ పాటను భారీ బడ్జెట్ తో తీశారు. అయితే ఈ పాటను విడుదల చేశాక అందులో వాడిన ‘హరే రామ హరే కృష్ణ’ మంత్రం వివాదాస్పదమైంది. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కరాటే కళ్యాణి సహా పలువురు ఫిర్యాదు చేశారు. అశ్లీల దుస్తులు, నృత్యాలు చేస్తూ ఈ పాటను తీశారని వారు ఆరోపిస్తున్నారు. నిలిపివేయాలని కోరుతున్నారు.
దేవీ శ్రీప్రసాద్ పై ప్రముఖ వివాదాస్పద సినీ నటి కరాటే కళ్యాణి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ ఐటెం సాంగ్ విషయమై ఆమె మండిపడుతూ పోలీసులకు కంప్లైంట్ చేసింది.కరాటే కల్యాణి చేసిన ఫిర్యాదుపై సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పై కేసు నమోదు చేసిన సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. లీగల్ ఒపీనియన్ తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు
ఈ వివాదంలోకి తాజాగా ఏపీ బీజేపీ చేరింది. ఏపీ బీజేపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి సహా పలువురు బీజేపీ నేతలు దేవీ శ్రీ ప్రసాద్ పై మండిపడ్డారు. దేవీ శ్రీ ‘హరే రామా’ సాంగ్ లో హిందువులను అవమానించాడని’ నిప్పులు చెరిగారు. వెంటనే ఈ పాటను తొలగించి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ దేవుళ్లు, దేవతలను తరచూ అవమానించడం చిత్ర పరిశ్రమలో కొందరికీ అలవాటుగా మారిందిన ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందీలో రూపొందించిన ఈ పాట ఇప్పటికే 20 మిలియన్ల వ్యూస్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ పాపులర్ అయ్యింది. అయితే ఇందులోని పదాలతో దేవీశ్రీ కొత్త వివాదాల్లో చిక్కుకున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.