ఎగ్జిట్ పోల్స్ అన్నీ కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ వస్తుందని తేల్చేశాయి. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర పక్షాల్లో మాత్రం ఏదో మూల ఆశ.. బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ అయిన 272 సీట్ల కంటే తక్కువ వస్తే ప్రాంతీయ పార్టీలు కీలకం అవుతాయి. ఆ సమయంలో బీజేపీని ఆదుకునే పార్టీలు ఏవి అనే చర్చ ఢిల్లీ బీజేపీ వర్గాల్లో నడుస్తోందట..
అమిత్ షా తాజాగా ఢిల్లీలో ఇచ్చిన విందులో ఎన్డీఏ మిత్రపక్షాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకవేళ బీజేపీకి మెజార్టీ తగ్గితే ఏఏ ప్రాంతీయ పార్టీల మద్దతు కోరాలనే దానిపై అమిత్ షా - మోడీ తదితర సీనియర్లు సమాలోచనలు జరిపినట్టు తెలిసింది.
ఈ చర్చల్లో ప్రధానంగా బీజేపీ దక్షిణాది పార్టీల కంటే ఉత్తరాది పార్టీల వైపే మొగ్గు చూపిందట.. బీజేపీకి సీట్లు తగ్గితే షరతులు, కోర్కెలతో మద్దతు ఇవ్వడానికి దక్షిణాదిన టీఆర్ ఎస్ - వైసీపీతోపాటు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కాచుకొని ఉన్నారు. కానీ కేసీఆర్ మద్దతు కావాలంటే ఎంతలేదన్న తెలంగాణ అభివృద్ధి పథకాల పేరిట లక్ష కోట్ల నిధులకు హామీ ఇవ్వాల్సిందే. ఇక ఒడిషా సీఎం కూడా నిధులే కోరుతున్నారట.. ఇక వైసీపీ అధినేత జగన్ కోరిక తీర్చాలంటే ముందు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. కానీ బీజేపీ హోదా ఇవ్వలేమని ముందే తేల్చిచెప్పింది. దీంతో ఈ మూడు దక్షిణాది పార్టీల కంటే ఉత్తరాదిన ఉన్న ఎస్పీ - బీఎస్పీలకు గాలం వేసి వారికి మంత్రి పదవులు ఇస్తే సరిపోతుందని బీజేపీ అంచనావేస్తోంది.
ఎస్పీ - బీఎస్పీలు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో అధికారంలో లేవు. సో ఆ రాష్ట్రానికి నిధులు - లక్షల కోట్లు అడిగే అవకాశం వాటికి లేదు. దీంతో వారి కోరికలు మహా అయితే కేబినెట్ మంత్రులు, కీలక పదవులే అడుగుతారు. అందుకే దక్షిణాది వారికంటే ఉత్తరాది వారే మేలు అని బీజేపీ భావిస్తోంది. ఇక దక్షిణాది పార్టీలు ఎప్పుడైనా కూటమి నుంచి కోర్కెలు తీరలేదని ఎగ్జిట్ అవుతాయి. అదే ఉత్తరాది వారికి పదవిపై ఆశ చావదు. అందుకే ఈ కోణంలోనే టీఆర్ ఎస్ వైసీపీ - బీజేడీ కంటే హంగ్ వస్తే ఎస్పీ-బీఎస్పీలే బెటర్ అన్న ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం.