బీజేపీకి తెలంగాణ వాళ్లు లేరా.. హిందీ వాళ్లు రావాలా?

Update: 2022-10-12 10:50 GMT
మునుగోడు ఉప ఎన్నిక నేప‌థ్యంలో ప్ర‌ధాన పార్టీలు జోరుమీదన్నాయి. ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌చారాన్ని ముమ్మ రం చేస్తున్నాయి. అంతేకాదు.. గ‌డ‌ప గ‌డ‌ప‌కు తిరుగుతున్నాయి.నాయ‌కులు దూకుడు పెంచారు. ప్ర‌తి ఒక్క విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో అన్ని పార్టీల నాయ‌కులు విస్తృతంగా తిరుగుతున్నారు. ముఖ్యంగా అధికార టీఆర్ ఎస్‌, ప్ర‌ధాన ప్ర‌తిపక్షం కాంగ్రెస్ పార్టీలు.. త‌మ త‌మ నేత‌ల‌ను రంగంలోకి దింపాయి. కీల‌క నేత‌లు స‌హా కార్య‌క‌ర్త‌లు..కూడా మునుగోడును చుట్టేస్తున్నారు.

అయితే.. మునుగోడులో జెండా ఎగ‌రేయాల‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు దీనిని ప్రాతిప‌దిక చేసుకోవాల‌ని భావిస్తు న్న బీజేపీకి మాత్రం నేత‌ల‌ను ఢిల్లీ నుంచి ఇత‌ర రాష్ట్రాల నుంచి దిగుమ‌తి చేసుకోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంద‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. పోనీ.. బీజేపీ స్థానిక నేత‌లు చెబుతున్న‌ట్టు వారు అతిర‌థ మ‌హార‌థులే కావొచ్చు. కానీ స్థానిక భాష రాదు.. ఇక్క‌డి స‌మ‌స్య‌లు తెలియ‌వు. అంతేకాదు.. లోక‌ల్ పీపుల్ నాడిని ప‌ట్టుకునే ప‌రిస్థితి కూడా లేదు.

పైగా వాళ్లు హిందీలో మాట్లాడితే.. ఇక్క‌డ దానిని అనువదించేందుకు మ‌రొక‌రు కావాలి. ఇదీ.. బీజేపీ ప‌రి స్థితి! క‌నీసం.. బూత్ లెవిల్ మాట ప‌క్క‌న పెట్టినా.. వార్డు వారీగా అయినా.. కార్య‌క‌ర్త‌లు లేని పార్టీగా బీజేపీ మారిపోయింది. అస‌లు మునుగోడులో నిన్న మొన్న‌టి వ‌ర‌కు బీజేపీ మాట ఎత్తిన వారే లేరు. అంతేకాదు.. ఆ పార్టీ జెండా మోసిన వారు అంత‌క‌న్నా లేరు. నిజానికి ఏ పార్టీ అయినా.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌తి వార్డుకు నాయ‌కుల‌ను రంగంలోకి దింపుతుంది.

కాంగ్రెస్‌లోనూ.. క్షేత్ర‌స్థాయిలో లెక్క‌లేనంత మంది కార్య‌క‌ర్త‌లు.. ఉన్నారు. ఎమ్మెల్యేలు.. కీల‌క నాయ‌కు లు.. సీనియ‌ర్లు ఉన్నారు. ఇక, అధికార పార్టీ విష‌యానికి వ‌స్తే.. ఈ పార్టీకి కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రులు ఉన్నారు.

వీరంతా రంగంలోకి దిగి.. ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేస్తున్నారు. బీజేపీని చూస్తే.. మాత్రం జాలేస్తోంది. ఆ న‌లుగురు(ఈట‌ల‌, ర‌ఘునంద‌న‌రావు, బండి, కిష‌న్‌రెడ్డి) త‌ప్ప‌.. ఇంకెవ‌రూ క‌నిపించ‌డం లేదు. ఎవ‌రు క‌నిపించాల‌న్నా ఢిల్లీ నుంచో.. యూపీ నుంచో ఫ్లైట్లు రావాల్సిన ప‌రిస్థితి!

పోనీ.. స్థానికంగా అయినా.. కేడ‌ర్‌ను పెంచుకుందామ‌ని చూస్తున్నా.. అది కూడా వ‌ర్క‌వుట్ కావ‌డంలేదు.  దీంతో ఇక, మునుగోడు విజ‌యం కేవ‌లం.. బీజేపీ నోటి మాట కాకుండా.. 'నోటు' మాట‌గా మారిపోయింద‌నే గుస గుస వినిపిస్తోంది. డ‌బ్బుల క‌ట్ట‌లు వెద‌జ‌ల్లి ఓట్ల‌ను రాల్చుకునే ప్లాన్ చేస్తున్నార‌ట‌. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి. ఏదేమైనా.. పునాదులు లేని పార్టీ.. పైపైకి ఎగురుతోంద‌ని.. ఏం జ‌రుగుతుందో చూడాల‌ని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News