విశాఖకు రైల్వే జోన్‌ రాబోతుందా.?

Update: 2019-02-23 09:13 GMT
ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇంకా నోటిఫికేషన్ రానప్పటికి మార్చి మొదటివారంలో నోటిఫికేషన్‌ విడుదల చేయాలనే ప్రయత్నాల్లో కేంద్రం ఉంది. అయితే ఇదే సమయంలో.. ధక్షిణాది రాష్ట్రాలపైనే కూడా బీజేపీ ఫోకస్‌ పెట్టింది. ఆల్‌రెడీ తమిళనాడు అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంది. కర్నాటకలో పెద్ద పార్టీగా ఎదిగింది. ఎటొచ్చి ఆంధ్రాలోనే ఎటూ కాకుండా పోయింది. అయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లాలన్నా..కనీసం రెండు మూడు సీట్లు అయినా గెలవాలన్నా ఏదో ఒకటి చెయ్యాలనే విషయం బీజేపీకి అర్థమైంది. దీంతో.. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల వాంచ అయిన విశాఖ రైల్వేజోన్‌ ని మరో వారం రోజుల్లో ప్రకటించేందుకు  సమాయత్తమవుతుంది.

యాక్చువల్‌ గా బీజేపీకి రైల్వేజోన్ ఇవ్వాలని ఎప్పటినుంచో ఉంది. కానీ అది ఎక్కడ టీడీపీ ఎక్కౌంట్‌ లో పడుతుందో అని ఇన్నాళ్లు వెయిట్‌ చేసింది. ఇప్పుడు టీడీపీ - బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉండడంతో.. ఇప్పుడు రైల్వే ఇచ్చేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈమేరకు రెండు రోజుల క్రితం విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు.. చూచాయగా హింట్‌ ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ నాయకులు టీమ్‌ ఢిల్లీ వెళ్లి కేంద్రం రైల్వే మంత్రి పియూష్‌ ఘోయల్‌ ని కూడా కలవబోతున్నారు. మార్చి 1నాటికి విశాఖకు రైల్వే జోన్‌ ప్రకటించి మొదటివారంలో మోదీతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీని ద్వారా ఉత్తరాంధ్రలో బీజేపీని స్ట్రాంగ్‌ చేయడంతో పాటు.. టీడీపీ ఆశలకు కూడా గంటి కొట్టినట్లు అవుతుంది.  క్రెడిట్‌ కూడా బీజేపీకి వస్తుందనేది మోదీ ప్లాన్‌.



Tags:    

Similar News