2014, 2019లో సింహం సింగిల్ గానే వచ్చినట్టు మోడీ మేనియాతో ఒంటరిగా పూర్తి మెజార్టీ సాధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. తొలి 2014లో 284 సీట్లకు గాను 294 సీట్లు సాధించింది. 2019లో ఏకంగా 303 దాటేసింది. కానీ చిన్నా చితక పార్టీలు కలిసి రావడంతో దానికి ఎన్డీఏ అని పేరు పెట్టి వారికి ఒక కేంద్రమంత్రి పదవి ఇచ్చి చేర్చుకుంది. సింగిల్ గానే మెజార్టీ వచ్చినా మిగతా వారిని కలుపుకొని వెళ్లింది బీజేపీ. అయితే ఎన్డీఏలో కలిసి బీహార్ సీఎం నితీష్, శివసేన, అకాలీదల్ పార్టీలు వైదొలి ప్రత్యర్థులతో చేరిపోయాయి.
మిత్రపక్షాలన్నీ దూరమైన పరిస్థితుల్లో 2024లో ఖచ్చితంగా బీజేపీ పని అయిపోతుందని అందరూ అనుకుంటున్న వేళ అసలు ట్రెండ్ ఎలా ఉందని బీజేపీ ఆరాతీసింది. ఇక ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోయిన పార్టీలు ఆ స్థాయిలో బలోపేతం కాకపోవడం బీజేపీకి వరంగా మారింది. ఆ విడిపోయిన పార్టీలున్న రాష్ట్రాల్లో బీజేపీనే బలంగా తయారవ్వడం గమనార్హం.
ఇక బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలందరినీ కలుపుకొని వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయి. బీజేపీ నుంచి విడిపోయిన శివసేనతో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. నితీష్ కుమార్ కు మద్దతిచ్చిన కాంగ్రెస్ బీహార్ లో ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యింది. వీళ్లందరినీ కలుపుకొని వెళుతున్న కాంగ్రెస్ ఈసారి గ్యారెంటీగా విజయం తమదేనని నమ్మకంతో ఉంది.
ఈ దశలో బీజేపీ చేయించుకున్న సర్వే హాట్ టాపిక్ మారింది. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల పాజిటివ్ లేదు. ఆ కారణంగానే ఆ పార్టీ ఎవరితో జట్టుకట్టినా వాళ్లు కూడా దెబ్బతింటారు అని ప్రజల సర్వేలో తేలిందట.. ఈ దఫా బీజేపీకి దేశవ్యాప్తంగా 320-326 సీట్లు వస్తాయని బీజేపీ చేసుకున్న సర్వేలో తేలినట్టు సమాచారం.
బీజేపీ అంచనా నిజమైతే వచ్చే సారి కూడా అధికారం మోడీదే. అయితే వచ్చే 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందా? లేదా? అన్నది బయటపడుతుంది. వీటి ఫలితంపైనే బీజేపీ దేశంలో మళ్లీ వస్తుందా? లేదా? అన్నది తేలనుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.